సాక్షి, హైదరాబాద్: దుబాయ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో నలుగురు భారతీయలు(ఓ జంటతో) సహా మరో 16 మంది చనిపోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు సమాచారం. కాగా, భారతీయ జంటను కేరళకు చెందినవారిగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. దుబాయ్‌లోని అల్ రస్ ప్రాంతంలో సివిల్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని నాలుగో అంతస్తులో సంభవించిన మంటలు క్రమంగా మిగతా అంతస్తులకు పాకాయి. దీంతో, అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటానా స్థలానికి ఫైరింజన్స్ చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఇక, ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన నలుగురు మృతిచెందారు. ఇక, మృతుల్లో కేరళలోని మల్లాపురానికి చెందిన దంపతులు కలంగదన్ రిజేష్, కందమంగళత్ జిషిగా గుర్తించారు. మంటల కారణంగా వీరిద్దరూ ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సెక్యూరిటీ గార్డు కూడా మృతి చెందినట్లు సమాచారం.
జిషి ఖిజాయిస్ క్రెసెంట్ స్కూల్‌లో టీచర్‌గా ఉండగా రిజేష్ ట్రావెల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే, మంటలకు షార్ట్‌సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపటినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు పాకిస్థానీలు, ఓ నైజీరియా మహిళ సహా పలువురు ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment