న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవంల రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన 19 ఏళ్ల జాక్వెలిన్ బీజిల్ అనే విద్యార్థిని లిప్టన్ హాల్‌లో అచేతన స్థితిలో పడి ఉంది. ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం వచ్చి పరిశీలించగా ఆ స్టూడెంట్ చనిపోయినట్లు తేలింది.
ఇక డోరీ సాల్టి అనే మరో విద్యార్థి శనివారం ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బర్నే బిల్డింగ్ బయట పడిపోయి ఉంది. ఈ విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి పడిపోయిందా లేక భవనం మీద నుంచి దూకిందా అన్న విషయంపై క్లారిటీ లేదు. సాల్టి కుటుంబానికి సన్నిహితులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలో మానసిక సంబంధమైన సమస్యలకు సరైన కౌన్సెలింగ్ లేకపోవడం వల్లే విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment