ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో ఏడంతస్తుల భవనంలో గురువారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. శ్వాససంబంధ సమస్యల కారణంగా గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సమంతాలాల్ తెలిపారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
తొలుత భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు తర్వాత పై అంతస్తులోని మరిన్ని రెస్టారెంట్లకు వ్యాపించాయి. పై అంతస్తుల్లో రెస్టారెంట్లతో పాటు దుస్తుల దుకాణం కూడా మంటల్లో కాలిపోయింది. ఇప్పటివరకు అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించి అక్కడి నుంచి తరలించారు.
అయితే వీరిలో 42 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనలో కొందరు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ప్రమాదం జరిగిన భవనంలో ప్రతి అంతస్తులో రెస్టారెంట్లుండటంతో గ్యాస్ సిలిండర్లు ఎక్కువయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment