7 Dead As Bus Collides With Truck On Nagpur-Pune Highway - Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఏడుగురు మృతి

Published Tue, May 23 2023 11:48 AM | Last Updated on Tue, May 23 2023 11:57 AM

Bus Collides With Truck On Nagpur-Pune Highway - Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నాగాపూర్‌-పూణే హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

వివరల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె నుంచి నాగాపూర్‌-పూణే హైవేపై మెహ‌క‌ర్ రూట్‌లో బ‌స్సు వెళ్తోంది. ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ఓ ట్ర‌క్కు ఆ బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వెంటనే.. గాయ‌ప‌డ్డ‌వారిని సింద్‌కేదార్‌రాజా హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అయితే, రెండు వాహ‌నాలు వేగంలో ఉండటంతో బ‌లంగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో రెండు వాహనాలు తుక్కుతుక్క‌య్యాయి. బ‌స్సు, ట్ర‌క్కుకు చెందిన గ్లాసు ప్యాన‌ల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. దీంతో, ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. 

ఇది కూడా చదవండి: రాధ మర్డర్‌.. ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement