nagpur highway
-
రాంగ్ రూట్లో హైవేపైకి కారు ఎంట్రీ.. సినిమా రేంజ్లో ప్రమాదం
ముంబై: ముంబై-నాగపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు రాంగ్ రూట్ వెళ్లి మరో కారును ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సందర్భంగా సినిమా రేంజ్లో ఎగిరి బారికేడ్లపై పడింది.వివరాల ప్రకారం.. ముంబైకి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో జల్నా జిల్లాలో ముంబై-నాగపూర్ ఎక్స్ప్రెస్వైపు ఓ కారు బీభత్సం సృష్టించింది. కడ్వాంచి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కారు డ్రైవర్ పెట్రోల్ ఫిల్ చేసుకున్న అనంతరం రాంగ్ రూట్లో హైవేపైకి వచ్చాడు. ఇలా రాంగ్ రూట్ నుంచి కారును క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొన్నాడు.దీంతో, ఒక్కసారిగా కారు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న బారికేడ్లపై పడిపోయింది. కారులో ఉన్న వారంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక, ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నాగాపూర్-పూణే హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె నుంచి నాగాపూర్-పూణే హైవేపై మెహకర్ రూట్లో బస్సు వెళ్తోంది. ఎదురుగా స్పీడ్‌గా వస్తున్న ఓ ట్రక్కు ఆ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే.. గాయపడ్డవారిని సింద్‌కేదార్‌రాజా హాస్పిటల్లో చేర్పించారు. అయితే, రెండు వాహనాలు వేగంలో ఉండటంతో బలంగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో రెండు వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. బస్సు, ట్రక్కుకు చెందిన గ్లాసు ప్యానల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో, ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. ఇది కూడా చదవండి: రాధ మర్డర్.. ట్విస్ట్లే.. ట్విస్ట్‌లు.. -
6 వరుసలుగా నాగ్‌పూర్ హైవే
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చిక్కులతో విలవిల్లాడుతున్న 44వ నంబర్ జాతీయ రహదారి(నాగ్‌పూర్– నిజామాబాద్ హైవే)ని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఈ మేరకు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి నుంచి మేడ్చల్ తర్వాత ఉండే కాల్లకల్ వరకు దాదాపు 24 కి.మీ. మేర రహదారిని విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ జాతీయ రహదారికి ఇరువైపులా మేడ్చల్ వరకు కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. కూడలి ప్రాంతాల్లో సిగ్నల్ పడితే కిలోమీటర్ మేర వాహనాల బారులు తీరుతున్నాయి. దీంతో ఈ రహదారిని విస్తరించాలని చాలాకాలం నుంచి ప్రజలు కోరుతున్నారు. భారీ ఎలివేటెడ్ కారిడార్లతో.. బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వరకు కీలక కూడళ్లలో భారీ ఎలివేటెడ్ కారిడార్లకు ప్రణాళిక రచించారు. హైదరాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే దారిలో తొలుత కీలక జంక్షన్ అయిన సుచిత్ర కూడలి వద్ద 2 కి.మీ. పొడవైన వంతెన నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి 10 కి.మీ. అంటే గుండ్లపోచంపల్లి వరకు మూడు భారీ వంతెనలు ఉంటాయి. సుచిత్ర కూడలి మొద టిది కాగా, సినీప్లానెట్ కూడలి వద్ద 560 మీటర్ల పొడవుతో రెండో వంతెన, కొంపల్లి–దూలపల్లి మధ్య 1.2 కి.మీ. మేర మూడో వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి మేడ్చల్ దాటేవరకు రోడ్డును పూర్తి స్థాయిలో విశాలంగా మారుస్తారు. మేడ్చల్ దాటే వరకు రెండున్నర కి.మీ. మేర వంతెన నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించారు. బోయిన్పల్లి నుంచి గుండ్ల పోచంపల్లి వరకు పనులకు రూ.450 కోట్లు, అక్కడి నుంచి మేడ్చల్ వరకు చేపట్టే పనులకు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. -
ఆర్టీఏ తనిఖీలు: ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నాగ్‌పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.