satisfaction
-
ఆర్థిక పనితీరు ఫర్వాలేదు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందంటూ.. రానున్న రోజుల్లో డిమాండ్ పరిస్థితులపై పరిశీలన అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల దృక్పథం ఉంది. సాగు రంగం పట్ల సానుకూల అంచనాలు, పండుగల్లో డిమాండ్ మెరుగుపడుతుందన్న అంచనాలు, ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు పెట్టుబడులకు ఊతమిస్తాయి’’అని సెపె్టంబర్ ఎడిషన్ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో ఆర్థిక శాఖ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25 సంవత్సరానికి 6.5–7 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. వినియోగ సెంటిమెంట్ మృదువుగా మారడంతో పట్టణ డిమాండ్ మోస్తరు స్థాయికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోందని.. సాధారణం మించి వర్షాలతో ఫూట్ఫాల్ (షాపులను సందర్శించే కస్టమర్లు) పరిమితంగా ఉండడం, కాలానుగుణ కారణాలతో ప్రజలు కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉన్నట్టు వివరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్తబ్దత మరింత అధికం కావడం, అభివృద్ధి చెందిన దేశాల వాణిజ్య విధానాల్లో అనిశ్చితి ఇవన్నీ ఆర్థిక వృద్ధికి రిస్క్‌లుగా పేర్కొంది. వీటి ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రసరించే రిస్క్ ఉందంటూ.. అదే జరిగితే డ్యూరబుల్ గూడ్స్‌పై వినియోగదారులు చేసే వ్యయాలపై ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే.. వరుసగా రెండు నెలల పాటు తగ్గిన ద్రవ్యోల్బణం తిరిగి సెపె్టంబర్లో పెరిగిపోవడం తెలిసిందే. కానీ, కొన్ని కూరగాయలను మినహాయిస్తే ద్రవ్యోల్బణం దాదాపుగా నియంత్రణలోనే ఉన్నట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు మెరుగ్గా ఉండడం, ఖరీఫ్‌లో జోరుగా విత్తన సాగు వ్యవసాయ ఉత్పాదకత పట్ల ఆశాజనక అంచనాలకు వీలు కలి్పస్తోందని.. ఆహార ధాన్యాల నిల్వలు తగినంత ఉండడంతో మధ్యకాలంలో ధరల కట్టడికి వీలుంటుందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో భారత్ పట్ల సానుకూల సెంటిమెంట్ ఉన్నట్టు వెల్లడించింది. స్థిరమైన వృద్ధి సాధించడం ద్వారానే ఈ సెంటిమెంట్‌ను వాస్తవిక పెట్టుబడులుగా మలుచుకునేందుకు అవకాశాలుంటాయని పేర్కొంది. నెల రోజుల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో రూ.85వేల కోట్లకు పైగా అమ్మకాలు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. విదేశాలతో ఆర్థిక కార్యకలాపాలు (ఎక్స్టర్నల్ సెక్టార్) మెరుగ్గా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. పెరుగుతున్న పెట్టుబడులు, స్థిరమైన రూపాయి, మెరుగైన స్థితిలో విదేశీ మారకం నిల్వలను ప్రస్తావించింది. సెపె్టంబర్ చివరికి 700 బిలియన్ డాలర్లను విదేశీ మారకం నిల్వలు దాటిపోవడాన్ని గుర్తు చేసింది. తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు క్రమంగా విస్తరిస్తున్నట్టు తెలిపింది.వృద్ధి మందగమనంలోకి భారత్జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగు పెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా ప్రకటించింది. జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం మేర భారత జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తమ అంచనాలు మరింత క్షీణించడానికి రిస్‌్కలు పెరుగుతున్నట్టు పేర్కొంది. వృద్ధి సూచికలు జీడీపీ మరింత మోస్తరు స్థాయికి చేరుకుంటుందని సూచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇటీవలి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష తన గత అంచనాలను కొనసాగించడం తెలిసిందే. పట్టణాల్లో వినియోగం సాధారణంగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని.. ప్యాసింజర్ వాహన విక్రయాలు తగ్గడం, విమాన ప్రయాణికుల రద్దీ మోస్తరు స్థాయికి దిగిరావడం, ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాలు దీనికి నిదర్శనాలుగా పేర్కొంది. పట్టణ వినియోగంలో ఈ బలహీన ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు నోమురా తెలిపింది. కంపెనీలు వేతన వ్యయాలను తగ్గించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘‘కరోనా అనంతరం ఏర్పడిన పెంటప్ డిమాండ్ సమసిపోయింది. ద్రవ్య విధానం కఠినంగా మారింది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ ఆంక్షలు వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ రుణాల వృద్ధి క్షీణతకు దారితీశాయి’’ అని నోమురా తన నివేదికలో వివరించింది. -
కేంద్రం ప్రయత్నాలను ప్రశ్నించలేం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఈ ఏడాది 9 చీతాల మృతి విషయంలో కేంద్రం ఇచి్చన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో చీతాల సంతతిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అనుమానాలకు అవకాశం లేదని పేర్కొంది. 1952 తర్వాత దేశంలో చీతాల సంతతి అంతరించిపోయింది. దీంతో, తిరిగి వాటి సంతతిని పెంచే ఉద్దేశంతో గత ఏడాది సెపె్టంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను కునోకు తీసుకువచి్చంది. ఇక్కడ మరో నాలుగు కూనలు జని్మంచాయి. వీటిలో మొత్తం 9 మృత్యువాతపడ్డాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం పిటిషన్ వేసింది. విదేశాల నుంచి తీసుకువచి్చన చీతాలను ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. -
మంచి మాట: కృతజ్ఞత గొప్ప సంస్కారం
‘కృతజ్ఞత ’ అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం. ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం. ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది. మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి. అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము. కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు. ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది. అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు. కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు. తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది. – భువనగిరి కిషన్ యోగి -
ఇది నారాయణుడి సేవ
వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్ కీ బాత్’లో నారాయణన్ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్ నారాయణన్ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు. నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా? మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి? పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి? నారాయణన్ ఏం చేశాడు? కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్ నారాయణన్‌కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్ పెట్టిన భిక్షే. ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు. ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్‌కు హోల్‌సేల్ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నారాయణన్ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి. ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం. శ్రీరామ్ నారాయణన్ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు -
కరోనా కట్టడి చర్యలపై ఐఎంసీటీ సంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) ఇక్కడి కట్టడి చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ పేర్కొన్నారు. గురువారం కరోనా తాజాస్థితి వివరాలు తెలిపారు. ఇందులో భా గంగా హైదరాబాద్‌లో క్షేత్రస్థాయి పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐఎంసీటీ బృందం ఆస్పత్రులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్, మార్కెట్లను సందర్శించింది. టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్లు తగినన్ని ఉన్నాయని ఈ బృందం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డు ద్వారా పేషెంట్ల రాక నుంచి డిశ్చార్జి వరకు పర్యవేక్షిస్తోందని తెలిపింది. స్టేట్ నోడల్ సెంటర్‌గా ఉన్న గాంధీ ఆస్పత్రిని కూడా కేంద్ర బృందం సందర్శించింది. రోజుకు 300 టెస్టులు జరిపే సామర్థ్యం ఈ ఆస్పత్రి లేబొరేటరీకి ఉంది. చికిత్స అందిన తర్వాత పేషెంట్‌ను ఇంటి వద్దకు వాహనంలో పంపిస్తోంది. 14 రోజుల పాటు మొబైల్ ద్వారా వారిని పర్యవేక్షిస్తున్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో కూడా అన్నిరకాల ప్రామాణిక నిబంధనలు పాటిస్తున్నారు. శాంపిల్ సేకరణ వసతి ఉంది. ఆస్పత్రిలో పీపీఈ కిట్ల డానింగ్, డాఫింగ్ ఏరియాలను వేర్వేరుగా దూరంగా ఉంచాలని బృందం ఆస్పత్రికి సూచించింది. పేషెంట్లకు, సిబ్బం దికి వేర్వేరు కారిడార్లు కేటాయించాలని సూచించింది. హుమాయున్‌నగర్ కంటైన్మెంట్ కేంద్రాన్ని కూడా టీం పరిశీలించింది. క్వారంటైన్ కేంద్రాన్ని, సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను కూడా సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది. రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఔషధాల సరఫరా పర్యవేక్షణ ఉన్నట్లు బృందం గ్రహించింది. షెల్టర్ హోంను కూడా సందర్శించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. మొబైల్ క్యాంటీన్లు, నైట్ షెల్టర్లు, అనాథాశ్రమాల ద్వారా భోజన వసతి ఏర్పాట్లు, లాక్డౌన్ నిబంధనలు అమలు, సామాజిక దూరం పాటించడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని భవన నిర్మాణాల వద్ద కార్మికులు మాస్కుల్లేకుండా పనిచేయడం చూసి దానిపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించింది’అని శ్రీవాస్తవ వివరించారు. కాగా, తెలంగాణలో కేసుల రెట్టింపు రేటు 40 రోజులకు పైగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ సంయుక్త శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. -
సమంత ఆత్మసంతృప్తి కోసమే అలా చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఏ పనిచేసినా ఆత్మ సంతృప్తితో చేసే నైజంనటి సమంతది. ప్రముఖ నటీమణులు చిత్రరంగంలో కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నారు. పెద్ద మాల్స్, నగల షోరూంలు, వస్త్ర దుకాణాలు ప్రారంభిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రూ. లక్షలు, కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు. అందులోనూ కొందరు నిర్ణీత మొత్తాన్ని అందజేస్తేనే నటిస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. చిన్న షాపులు ప్రారంభించడానికి వారిని సంప్రదించడమే కఠినమైన విషయంగా మారుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ చిన్న టీ, టిఫెన్ సెంటర్‌ను నటి ప్రారంభిస్తే బాగుంటుందని భావించిన ఓనర్ కొందరు నటీమణులను సంప్రదించారు. అయితే అతనికి వారిని కలుసుకోడానికే వీలుకాలేదు. సమంత మంచి పారితోషికంతో వాణిజ్య ప్రకటనల్లో నటించే నటీమణుల కోవలో ఉన్నారు. ఆమె తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. సమంతను అడిగి చూద్దాం.. అదృష్టం ఎలా ఉంటుందో అని భావించిన టీ షాప్ ఓనర్ ఆమెను తన సెంటర్ ప్రారంభించమని కోరారు. వెంటనే సమంత ఇందుకు ఒప్పుకున్నారు. ఒకరోజు ప్రత్యేకంగా వచ్చి రిబ్బన్ కట్‌చేసి షాప్ ప్రారంభించారు. దీంతో ఆ టీ షాప్ యజమాని ఆనందానికి అవధుల్లేవు. సమంత కేవలం డబ్బు కోసమే కాదు.. తన ఆత్మసంతృప్తి కోసం ఇటువంటి పనులు చేస్తుండడం గమనార్హం. ఆమె ఎవరో చెబితే నిర్ణయం తీసుకోరని, స్వయంగా నిర్ణయం తీసుకునే స్వభావం ఉన్నవారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. -
ఏపీలో పోలీసుల పనితీరు భేష్
సాక్షి, అమరావతి: శాంతిభద్రతల విషయంలో 2017లో రాష్ట్ర పోలీసులు ఎక్కడా ఫెయిల్ కాలేదని, పోలీసుల పనితీరు సంతృప్తిగా ఉందని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ఎర్రచందనం విషయంలో అధికారులు చక్కగా పనిచేస్తున్నారంటూ ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, స్మగ్లర్లను పట్టుకోవడంలో మంచి పురోగతి సాధించామని విలేకరుల సమావేశంలో తెలిపారు. సైబర్ నేరాలు 46 శాతం పెరిగాయన్నారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఎ, బి, సి, డి కేటగిరీలో అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. రహదారి ప్రమాదాలను 5 శాతం తగ్గించామన్నారు. రూ.68 కోట్లను చలానా రూపంలో వసూలు చేశామని, గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు 20 టీమ్‌లను ఏర్పాటు చేశామని, నక్సల్స్‌ను నియంత్రించడంలో విజయం సాధించామని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి నక్సల్స్ సమస్యను ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. కోడి పందేల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ పిన్స్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ వల్ల పోలీసులు సీజ్ చేసిన వాహనం ఏ పోలీస్ స్టేషన్లో ఉందో తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన వాహనాల విషయంలో ఇది ఎంతో ఉపయోగకరమని సాంబశివరావు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు ఎంజాయ్ చేయొచ్చని, అయితే మత్తు పానీయాలు తాగని వారితోనే వాహనం నడిపించాలని సూచించారు. -
సేవలోనే సంతృప్తి
– ఎంపీ ఎస్పీవైరెడ్డి – నంద్యాలలో రోటరీ ఇంటర్నేషనల్ సదస్సు ప్రారంభం – హాజరైన రెండు రాష్ట్రాల క్లబ్‌ల ప్రతినిధులు నంద్యాల: సమాజానికి, ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి, ఆనందం దాగి ఉంటుందని ఎంపీ ఎస్పీవైరెడ్డి చెప్పారు. స్థానిక వైజంక్షన్‌లోని సౌజన్య కన్వెన్షన్ హాల్లో శనివారం రోటరీ క్లబ్ 3160 ఇంటర్నేషనల్ సదస్సు గవర్నర్ కందుకూరి శ్రీరామమూర్తి అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైంది. సదస్సులో కర్ణాటకలోని ఏడు, ఏపీలోని ఆరు జిల్లాలలోని 68 క్లబ్‌లకు చెందిన వెయ్యిమంది ప్రతినిధులు పాల్గొన్నారు. అతిథులుగా ఎంపీతోపాటు మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన హాజరయ్యారు. అనంతరం ఎంపీ ఎస్పీవైరెడ్డి మాట్లాడుతూ చిరునవ్వుతో ఎంత కష్టానైనా సాధించవచ్చన్నారు. నంద్యాలలో రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. కందుకూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా విద్య, వైద్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. మాజీ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పోలియో వ్యాధి నిర్మూలనకు రోటరీ క్లబ్ చేసిన సేవలు ప్రశంసానీయమన్నారు. క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి మాట్లాడుతూ రోటరీ అందిస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం క్లబ్ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ అద్యక్షుడు రమేష్, కాన్ఫరెన్స్ చైర్మన్ చిన్నపురెడ్డి, క్లబ్ పీడీజీ గుర్జీత్‌సింగ్ శిఖోన్, క్లబ్ ఇన్నర్‌వీల్ చైర్పర్సన్ వీణాస్వామి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుబ్బరామయ్య, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేంద్రనాథ్, సీనియర్ రొటేరియన్లు విజయశేఖర్‌రెడ్డి, నెరవాటి సత్యనారాయణ, డాక్టర్ మధుసూదనరావు, నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ యూత్ ఇప్పుడు హ్యాప్పీ!
లండన్: ఆర్థిక వ్యవహారాల్లో సాధించిన పురోగతిపై ఇప్పుడు బ్రిటన్ యువత సంతృప్తి వ్యక్తం చేస్తోంది. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో తగినంత ఆదాయం, ఆదాయ మార్గాలు లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొని అసంతృప్తిలో మగ్గిన యువత తమ ప్రస్తుత స్థితిపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్ఎస్) వెల్లడించింది. 16 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువత అభిప్రాయాలు తీసుకొని ఓఎన్ఎస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2012 నుంచి 2015 మధ్య కాలంలో బ్రిటన్‌లో 16 నుంచి 24 ఏళ్ల మధ్యగల యువకుల్లో నిరుద్యోగ శాతం అత్యధికంగా 20 శాతంకు కూడా చేరుకుందని ఈ సంస్థ వెల్లడించింది. అయినప్పటికీ ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక అవకాశాలతో యువత సంతృప్తికరంగా ఉన్నారని ఓఎన్ఎస్ తెలిపింది. ఇదే సమయంలో వయోజనులతో పోల్చినప్పుడు అప్పుడే సంపాదన ప్రారంభించిన యువకుల్లో ఆదాయం అధికంగా ఉంటుందని సంస్థ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. -
సేవ కూడా సాధనే...
ధ్యానమార్గం యోగ, ధ్యానం ఇవి శరీరాన్ని, మనసును మలినాల నుంచి విముక్తం చేసినా అసలైన సంతృప్తి మాత్రం స్వార్థ రహితమైన సేవ నుంచే వస్తుందని కొందరు యోగ సాధకుల ఉవాచ. పుణ్యక్షేత్రాల సందర్శన, పవిత్ర స్నానాలు, మొక్కులు ఇవి ఊరటను కలిగించవచ్చేమోగాని సాటి మానవునికి సేవ చేయడంలో వచ్చే సంతృప్తికి సమానం కాదని అంటున్నారు. సేవలో నిమగ్నమైతే- కష్టంలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి సాయం చేయడంలో నిమగ్నమైతే మనసు దాదాపు ధ్యానంలో నిమగ్నమైనంతగా శుభ్రపడుతుందని అంటున్నారు. ద్వేషాన్ని నాటితే ద్వేషం, సేవను నాటితే సంతోషం ఫలాలుగా దక్కుతాయనేది గుర్తుంచుకోవాలంటున్నారు. మరణం అనివార్యం. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఈ రోజే సత్యమని ఈ క్షణమే శాశ్వతమని నిష్కల్మషమైన మనసుతో సాటి వారికి ఆనందం కలిగించే పని చేస్తే దైవాన్ని దర్శించినట్టే అని యోగసాధకుల ఉవాచ. -
ప్లేట్ పూజ
కొబ్బరికాయ... టెంకాయ... నారికేళం... పేర్లేమైనా కాని పూజ చేయాలంటే ఇది పగలాల్సిందే. కాయ కొట్టు. దండం పెట్టు. మరి పొట్టకు? ప్లేట్ పూజ చేయాలంటే ఇది అక్కర్లేదా? పచ్చి కొబ్బరి... ఎండు కొబ్బరి... దాంతో ఒక కూర.. దీంతో ఒక భక్ష్యం... కార్తీకమాసం పూజపునస్కారాల మాసం. ప్రతి గుడిలో ఇంటిలో కొబ్బరి చిప్పలు పోగుపడే కాలం. ఆత్మ సంతృప్తికే కాదు జిహ్వ సంతృప్తికి కూడా ప్రయత్నించండి. గుడిలోకే కాదు... అలా కిచెన్‌లోకి కూడా నడవండి. గుప్... స్టవ్ మండింది. టప్... కొబ్బరి పగిలింది... స్టార్ట్. కొబ్బరి సెనగపప్పు కూర కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము - కప్పు, పచ్చి సెనగ పప్పు - కప్పు, కరివేపాకు - 3 రెమ్మలు, ఎండు మిర్చి - 6, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా. తయారీ: సెనగ పప్పుకు తగినంత నీరు జత చేసి ఉడికించాలి. (మరీ మెత్తగా అవ్వకూడదు. కుకర్‌లో కాకుండా విడిగా ఉడికించుకుంటే ముద్దలా అయిపోకుండా విడివిడిలాడుతూ వస్తుంది) బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ఉడికించుకున్న సెనగపప్పు వేసి బాగా కలపాలి కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా, మూత ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి వేడి వేడి అన్నంలో, కమ్మటి నెయ్యి వేసుకుని తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి వడలు కావలసినవి: బియ్యం - కప్పు, పచ్చికొబ్బరి ముక్కలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చి మిర్చి -4, ఉప్పు - తగినంత, క్యారట్ తురుము - పావు కప్పు, పుదీనా తరుగు - పావు కప్పు, అల్లం తురుము - టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తరుగు - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: బియ్యాన్ని సుమారు రెండు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి మిక్సీలో... నానిన బియ్యం, కొబ్బరి ముక్కలు, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి, ఉప్పు, అల్లం తురుము వేసి మెత్తగా తిప్పాలి మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తరుగు వేసి చేతితో బాగా కలపాలి బాణలిలో నూనె కాగగానే పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి రెండు వైపులా బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి. టొమాట్ సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. కొబ్బరి బూరెలు కావలసినవి: పాలు - కప్పు, పంచదార - కప్పు, కొబ్బరి తురుము - కప్పు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ఏలకుల పొడి - టీ స్పూను, మినప్పప్పు - అర కప్పు, బియ్యం - కప్పు. తయారీ: ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి 2 టేబుల్ స్పూన్ల పెరుగు జత చేసి పాలు విరిగే వరకు కలపాలి పంచదార వేసి కరిగించాలి కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మిశ్రమం చిక్కబడేవరకు ఉంచి దించేయాలి మినప్పప్పు, బియ్యం ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బాలి తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి తురుము మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె కాగాక, కొబ్బరి ఉండను బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి, బూరెల మాదిరిగా నూనెలో వేసి, వేయించి తీసేయాలి. కొబ్బరి జున్ను కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ - కప్పు, పచ్చి కొబ్బరి తురుము - కప్పు, పెరుగు - కప్పు, ఏలకుల పొడి - టీ స్పూను. తయారీ: ఒక పాత్రలో కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిల్క్, పెరుగు వేసి బాగా కలిపాలి ఏలకుల పొడి జత చేసి మరో మారు కలపాలి ఒక పాత్రలో ఈ మిశ్రమం వేసి,ఇడ్లీ కుకర్‌లో కాని, రైస్ కుకర్‌లో కాని ఉంచి, విజిల్ లేకుండా సుమారు అరగంటసేపు ఉంచి దించాలి చల్లగా అందించాలి. కొబ్బరి పులుసు కావలసినవి: కొబ్బరి తురుము - కప్పు, చింతపండు - నిమ్మకాయంత (నీళ్లలో నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాలి), బియ్యప్పిండి - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఎండు మిర్చి - 6, మెంతులు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, నూనె - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట, రసం పొడి - టీ స్పూను. తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి కొబ్బరి తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి చింతపండు పులుసు, ఉప్పు వేసి బాగా కలిపి మరిగించాలి చిన్న గిన్నెలో బియ్యప్పిండి, చిన్న గ్లాసుడు నీళ్లు వేసి చిక్కగా కలిపి, మరుగుతున్న పులుసులో వేసి కలిపి ఉడికించాలి పులుసు చిక్కబడ్డాక, కరివేపాకు, పసుపు, రసం పొడి వేసి బాగా కలిపి, దించే ముందు కొత్తిమీర వేయాలి. కొబ్బరి పొడి కావలసినవి: ఎండు కొబ్బరి చిప్ప - 1, పుట్నాల పప్పు - 2 కప్పులు, ఎండు మిర్చి - 7, సెనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు, నెయ్యి - టేబుల్ స్పూను. తయారీ: ముందుగా ఎండు కొబ్బరిని సుమారు గంటసేపు ఎండలో ఎండబెట్టాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి పొడిలా వచ్చేలా పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి పుట్నాల పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, పచ్చిసెనగ పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాక, ఎండు మిర్చిని మాత్రం వేరు చేసి, జీలకర్ర జత చేసి వేయించి తీసేయాలి మిగిలిన నేతిలో కరివేపాకు వేయించి తీసేయాలి పాత్రలో కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి, పోపు సామాను, కరివేపాకు వేసి బాగా కలపాలి వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో తింటే రుచిగా ఉంటుంది. (సూచన: కొబ్బరిని ఎక్కువ సేపు మిక్సీలో తిప్పకూడదు. అలా చేస్తే ఎండు కొబ్బరి నుంచి నూనె వచ్చే అవకాశం ఉంటుంది) -
సంతృప్తిగా పనిచేశా..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో దాదాపు రెండేళ్లు సంతృప్తికరంగా విధులు నిర్వహించాను. దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కరించటం నా ఉద్యోగ జీవితంలో మరిచిపోలేని అనుభూతి. జిల్లాలో పనిచేసిన కాలం ఓ మధురస్మృతిగా నిలిచిపోతుంది. ఖమ్మం నాకెన్నో పాలనానుభవాలు నేర్పింది..’ అని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ పేర్కొన్నారు. జిల్లా నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన ఆయన సోమవారం ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మంచి జిల్లాలో ఉద్యోగం చేయాలని... ప్రజలకు సేవ చేయాలంటే మంచి జిల్లాలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. ఖమ్మం జిల్లాలో పని చేయడంతో ఆ ఆకాంక్ష నేరవేరింది. జిల్లాలో పని చేయడం ఆనందంగా ఉంది. నా 13 ఏళ్ళ సర్వీస్‌లో రెండేళ్లు పూర్తిస్థాయిలో ఇక్కడ పనిచేయటం సంతృప్తిగా ఉంది. ప్రజా ప్రతినిధు లు అధికారులు, ఉద్యోగుల సహకారం మరువలేనిది. చైతన్యానికి జిల్లా మారుపేరు. ఒకవైపు ఏజెన్సీ, మరోవైపు నదులు, ఖనిజం, అటవీసంపద, పలురకాల వృత్తులు, ప్రవృత్తుల మేళవింపు మన జిల్లా. 1996లో సర్వీస్‌లో జాయిన్ అయ్యా ను. అందరి సహకారంతో 100 శాతం పని చేశా. నేను చాలా అదృష్టవంతుడుని.. ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఉద్యోగం సజావుగా సాగింది. భూ సమస్యలు... భూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని ముందుగానే భావించా. అనేక ఏళ్లుగా పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించా. జంగ్ సిపాయి భూములను నిబంధనల ప్రకారం అర్హులకు అందించాను. జిల్లా వ్యాప్తంగా 7 వ విడత అసైన్మెంట్ కింద మూడు నెలల్లో ఏడుగురికి 15 వేల ఎకరాలకు పట్టాలు, పహణీలు అందించాం. ఇందుకోసం గిరిజనులు, గిరినేతరులకు అవగహన కల్పించి భూముల సర్వే చేపట్టాం. డిజిటల్ సర్వే యంత్రాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేసి సక్సెస్ అయ్యాం. మీసేవ... గతంలో మీసేవ కేంద్రాలలో 20 సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాటిని 250 సర్వీసులకు చేర్చాం. మీసేవా కేంద్రాలు సజావుగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులైన వీఆర్వో నుంచి తహశీల్దార్ వరకు కంప్యూటర్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మీసేవలో పహణీల విషయంలో కొంత మేర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని నిరోధించేందుకు తహశీల్దార్లకు అవగహన కల్పించాం. అక్రమ పహణీలను అరికట్టాం. తహశీల్దార్ల బాధ్యత పెరిగింది. ల్యాండ్ సర్వే కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. రికార్డులను భద్రపరిచేందుకు అత్యాధునిక రికార్డురూమ్ను ఏర్పాటు చేశాం. టెక్నాలజీ వాడకంపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం, భద్రాచలంలో రూ.20 లక్షలతో ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేశాం. రికార్డుల భద్రతకు అత్యాధునిక రూం నెలకొల్పాం. ‘ఆధార్’తోనే అన్నీ.. ఆధార్ అనుసంధానంతో అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఆధార్ అనుసంధానంలో జిల్లా 3వ స్థానంలో ఉంది. జిల్లాలో 98 శాతం ఆధార్ నమోదు పూర్తయింది. ఏజెన్సీ ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్ళకుండా వారి చెంతనే ఆధార్ అందించే ప్రకియ చేపట్టి విజయవంతం అయ్యాం. సివిల్ సప్లైలో ఆధార్ అనుసంధానంతో అక్రమంగా ఉన్న 50 వేల తెల్లరేషన్‌కార్డులను తొలగించాం. నెలకు 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా చేశాం. ఆధార్ వల్ల గ్యాస్కనెక్షన్ లబ్ధిదారులను గుర్తించి కిరోసిన్ కోటానూ ఆదా చేశాం. గ్యాస్‌తో పాటు కిరోసిన్ పొందుతున్న వారిని అదుపు చేయడం వల్ల రూ.50 లక్షలు ఆదా అయ్యాయి. నిర్వాసితులకు న్యాయమే చేశాం భూ నిర్వాసితులకు అప్పటి విలువ ప్రకారం న్యాయమే జరిగింది. ప్రజలు అంగీకరించిన తరువాత మాత్రమే మేము ఫైల్స్ పని ప్రారంభించాం. అప్పటి విలువ ప్రకారం కొమ్మేపల్లిలో రూ.5 లక్షలు, కిష్టారంలో రూ.6 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రజలు తొలుత అంగీకరించి తర్వాత నిరాకరించారు. అప్పటికే గడువు రెండు సంవత్సరాలు ఉంది. చివరి సమయంలో ల్యాప్సయ్యే అవకాశం ఉండటంతో దానిని అమలు చేశాం. ఒప్పందం ప్రకారం ఎవరూ ముందుకు రాని సమయంలో సెక్షన్ 31 ప్రకారం కోర్టులో రూ.20 కోట్లు డిపాజిట్ చేశాం. కేసు జిల్లా జడ్జి కోర్టులో ఉంది. విద్యుత్ ప్రాజెక్టుల్లో.. జిల్లాలో నీరు, బొగ్గు, భూమి, రవాణావ్యవస్థ అనుకూలంగా ఉం డటంతో కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, అశ్వాపురంల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. ఏడో దశ విస్తరణలో భాగంగా ఇప్పటికే పాల్వంచలో మరో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మణుగూరులో 1031 ఎకరాల్లో 1080 మెగావాట్ల ప్రాజెక్టు, అశ్వాపురంలో 1300 ఎకరాల్లో 1600 మెగావాట్ల ప్రాజెక్టు, కొత్తగూడెంలో 3000 ఎకరాల్లో 4000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. అర్హులందరికీ ఆహారభద్రత.. జిల్లాలో అర్హులందరికీ ఆహారభద్రత అందించటమే లక్ష్యంగా పనిచేశాం. ఇప్పటికే 6,50,000 కార్డుల వివరాలు కంప్యూటరీకరించాం. ఇంకా 50వేల మంది వివ రాలు నమోదు చేయాలి. ఈ నెల 16 నుంచి అర్హులైన కుటుంబాలకు పూర్తిస్థాయిలో రేషన్ అందించేందుకు చర్యలు చేపట్టాం. గతంలో రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేశాం. ఇక నుంచి రేషన్ అర్హులకు మాత్రమే అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పాలని అనుకున్నాను. అది పూర్తిస్థాయిలో అమలైంది. మొదట 30 స్కూల్స్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ ప్రారంభించాం. ఇప్పుడు 250 పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. 25 వేల మంది విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా మూడునెలల్లో కోర్సు పూర్తి చేశాం. తరువాత హైదరాబాద్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటా. జిల్లాలో జమాబందీని అమలు చేయలేకపోయాం. గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల వివరాలు పంచాయతీ కార్యాలయం గోడలపై రాయిస్తున్నాం.