అందుకే అంటారు బాడీ ఉంటే సరిపోదు.. కాసింత బుర్ర కూడా ఉండాలి అని.. ఇక్కడ జరిగిందదే.. ఈ చీతాకు సెకన్ల వ్యవధి చాలు..గంటకు 95 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి.. ఈ ఇంపాలా మాత్రం గంటకు 80 కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తగలదు.. స్పీడ్ ప్రకారం చూస్తే.. చీతాదే పైచేయి.. మరి స్ట్రాటజీ.. ఇక్కడ స్పీడ్ చీతాది అయితే.. స్ట్రాటజీ ఇంపాలాది. అది 80 కిలోమీటర్ల వేగంలోనూ జిగ్‌జాగ్ తరహాలో పరిగెత్తగలదు.. దాంతో ఇంపాలాను.. లంచ్ కింద లాగించేయాలని చూసిన చీతాకే చివరికది చుక్కలు చూపించింది. జిగ్‌జాగ్ తరహాలో పరిగెత్తుతూనే చివరి నిమిషంలో గాడిదలా ఓ బ్యాక్ కిక్ ఇచ్చుకుంది. చూశారుగా.. దాని పరిస్థితి.. ఇక దాని గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్.. ఆఫ్రికా అడవుల్లో జరిగిన ఈ సన్నివేశాన్ని ఈ లు అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment