మొసలి.. దాని పట్టు, బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! నీటిలో ఉన్నప్పుడు ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. అలాంటి బలమైన మొసలికి-పులికి మధ్య ఎప్పుడూ ఆహారం కోసం వేటాడడంలో పోటీ ఉంటుంది. అయితే ఈ వేటలో మొసలి పైచేయి సాధిస్తే.. పులి భంగపాటు గురయ్యేది కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు. తాజాగా మొసలి వర్సెస్ చిరుత ఫైట్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మేహ్ర తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ చిరుతపులి నీరు తాగేందుకు సమీపంలోని కుంట ఒడ్డు వద్దకు వచ్చింది. పులి నీరు తాగుతుండగా అప్పటికే నీళ్లలో దాగి ఉన్న మొసలి ఒక్కసారిగా చిరుతపై మెరుపుదాడి చేసింది. దాని శక్తివంతమైన దవడలతో చిరుతను నోట కరచుకొని నీటిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో మొసలి ఓడిపోయింది. మొసలి దాడి చేసేందుకు ప్రయత్నించగా.. పులి ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరి తప్పించుకుంది. ప్రస్తుతం ఆ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. చిరుత చాలా వేగంగా చాకచాక్యంతో తప్పించుకున్న తీరుకు ఫిదా అవుతున్నారు. ‘ఎప్పుడూ నువ్వేనా.. ఈ సారి నీ పప్పులుడకవులే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Wilderness is full of uncertainties and surprises..
— Surender Mehra IFS (@surenmehra) May 29, 2021
‘Survival of fittest..’ #Wilderness @susantananda3 pic.twitter.com/yFfDggi3a1
Comments
Please login to add a commentAdd a comment