చెట్లను అవలీలగా ఎక్కడం, పాకడంతో పాటు నీటిలో ఈదడంలో ఆరితేరిన జంతువు చిరుత పులి. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుత అనడంలో సందేహమే లేదు. అయితే ఎంత బలవంతుడికైనా ఓ బలహీనత ఉంటుందని! అందుకే అంటారు. నీటిలో మొసలికి తిరుగులేదు. నీటిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద జంతువైనా మొసలి ముందు తల వంచాల్సిందే. అదే మొసలి బలం. ఓ చిరుత పులి నదిలో దాహం తీర్చుకుంటుండగా మొసలి హఠాత్తుగా దాడి చేసింది. చీతా(చిరుత పులి) దాని బారి నుంచి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చిరుత నివాసం భూమి కాబట్టి అది మొసలితో నీటిలో పోరాడలేక పోయింది. మొసలి కేవలం మూడు సెకన్లలోనే ఆ చిరుతను నీటి అడుగుకి తీసుకెళ్లిపోయింది.
అయితే ఆరు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘60 సెకన్లలో అంతా అయిపోయింది!! ఓ క్రూర జంతువు మరో క్రూర జంతువుకు ఆహారం అవుతుంది. ఇదే అడవిలో జరిగేది.’’ అంటూ మరల ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను కొద్ది గంటల్లోనే ఎనభై వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ ఈ భయంకరమైన ఘటన జరిగిన కొద్ది సెకన్లలోనే నీరు చాలా ప్రశాంతంగా మారింది. ఆ నిశ్శబ్దం బహుశా.. తన స్నేహితుడిని కోల్పోయిన నీరు దుఃఖిస్తున్నందుకు కావచ్చు’’. అంటూ ఓ నెటిజన్ విచారాన్ని వ్యక్తం చేశాడు.
(చదవండి: ఈ మామిడి పండు ఖరీదు రూ.1000 గురూ!)
Comments
Please login to add a commentAdd a comment