ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత అని మనందరికి తెలుసు. జంతువులను వేటాడే క్రమంలో అది పరుగెత్తినట్లు మరే జంతువు పరుగెత్తలేదు. అయితే ఇంత వేగంగా పరుగెత్తే జంతువు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శబ్దం ఎలా చేస్తుందో అందరికి తెలియదు. ఇప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందో ఈ వీడియో తెలియజేస్తుంది. దాని శబ్దం మీ చెవికి వినసొంపుగా ఉంటుంది. దీన్ని ఆస్ట్రేలియాలో ఉన్న వైల్డ్ క్యాట్ కన్జర్వేషన్ సెంటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!)
కేర్ టేకర్ ఓ అందమైన చిరుత గడ్డం నిమురుతూ ఉండగా, అది హాయిగా నిద్రపోతోంది. ఆ సమయంలో చిరుత నుంచి వచ్చే శబ్దం సంగీతం విన్నట్లుగా ఉంది. ఈ వీడియోను వైల్డ్ క్యాట్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘ప్రపంచంలోనే ఉత్తమైన శబ్దం ఇది’అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గడ్డం నిమురుతూ ఉంటే చిరుత పొందిన శాంతికి నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఇంతకంటే హాయిదనం ఏముంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment