సాక్షి, తిరుపతి : సాక్షి, తిరుపతి : తిరుపతిలో గురువారం ఉదయం చిరుత పులి భీభత్సం సృష్టించింది. రెండు ప్రాంతాల్లో దాడులు చేసింది. అర్ధరాత్రి జీవకణ లోని వీధిలోకి వచ్చిన చిరుత మొదట కుక్క మీద పంజా విసిరింది. అదే సమయంలో కుక్క పెద్దగా అరవడంతో నిద్రపోతున్న నాగరాజు లేచి చూసాడు. అదే సమయంలో చిరుత కుక్కను నోటితో పట్టుకొని గోడ దూకే ప్రయత్నం చేసి కింద పడిపోయింది. తిరిగి గోడ దుకుతుండగా కుక్క తప్పించుకుంది. అయితే ఇదే సమయంలో చిరుతను ప్రత్యక్షంగా చూసిన నాగరాజు భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనంతరం తెల్లవారుజామున జూపార్కు వద్ద బైక్‌ను వెంబడించి వ్యక్తి మీద పంజా విసిరింది. చిరుత దాడిలో బైక్ మీద వెళుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.
కొద్దిరోజుల కిందట తిరుమల ఘాట్ రోడ్డులో కూడా చిరుత సంచారం కలకలంరేపింది. ఓ చిరుత రోడ్డుపై వెళుతున్నవారిపై దాడి చేసింది. వారిద్దరూ చాకచక్యంగా దాడి నుంచి తప్పించుకోగా.. స్వల్ప గాయాలు అయ్యాయి. అంతేకాదు తిరుమలలో కూడా ఇటీవల చిరుతల సంచరించాయి. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా నిఘా పెంచారు.. తర్వాత చిరుతలు కనిపించలేదు.. మళ్లీ ఇప్పుడు తిరుపతిలో కనిపించడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment