గత కొద్ది రోజులుగా జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న చిరుత పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారుల చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చేతికి చిక్కినట్టే చిక్కి పారిపోయింది. ముమ్మడివరం మండలం గేదెల్లంకలోని ఒ కొబ్బరితోటలో ఉన్నగుడిసెలో దూరిన చిరుతకు వైద్యులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు.