
మైసూరు: తల్లి చిరుత రెండు పిల్లలతో కలిసి బోనులోకి చిక్కింది. జిల్లాలోని కేఆర్ నగర తాలూకాలోని దొడ్డవడ్డరగుడి గ్రామానికి దగ్గరలోని చెరుకు తోటలో ఇది జరిగింది. కొన్నిరోజులుగా పరిసర గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తోంది.
దీంతో గ్రామస్తులు, రైతులు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు పలుచోట్ల బోనులను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఒక ఆడ చిరుత రెండు పిల్లలతో కలిసి చెరుకుతోటలోని బోనులోకి పడింది. శనివారం ఉదయం తోటకు వెళ్ల్లిన కూలీలు చూసి అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి చిరుతలను తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment