నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఒక చిరుతపులి పడింది. బావిలోని నీటిలో అటు-ఇటు తిరుగుతూ.. దిక్కుతోచనిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్న చిరుతను గ్రామస్తులు గుర్తించారు. బావి నీటిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న చిరుత గురించి పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.