
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుల్లో చీతా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువు అయింది. ఇక వేటాడే సమయంలో చీతా పరిగెత్తే స్పీడు ఉహకందని విధంగా ఉంటుంది. తాజాగా ఒక వీడియోలో జింకజాతికి చెందిన గెజెల్‌ను అందుకునే క్రమంలో చీతా పరిగెత్తిన తీరు అలాగే అనిపిస్తుంది. చీతా పరిగెత్తిన తీరు చూస్తే ఎదుటోడికి అవకాశం ఇవ్వొద్దు అన్నతరహాలో జింకను వేటాడింది. కానీ వీడియోలో చీతా చేతికి చిక్కిందా లేదా అన్నది చూపించలేదు. ఈ వీడియోనూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుషాంత నంద ట్విటర్‌లో షేర్ చేశారు. 'చిరుతలు, చీతాలు ఎంత వేగంగా పరిగెత్తుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో తన పెద్ద తోకను బాలెన్స్ చేసుకొని పరిగెత్తడం ఆకట్టుకుంది' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(ఈ షాపు రూటే సపరేటు!)