అక్సాన్‌పల్లి ప్రాంతంలో చిరుత పులి అడుగుల దృశ్యం
సాక్షి, జోగిపేట (ఆందోల్): సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అక్సాన్‌పల్లి శివారులో ఆదివారం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన కృష్ణాగౌడ్ తన స్నేహితుడితో కలిసి తన బోరు మోటారు వద్దకు వెళ్లాడు. అక్కడ ఏదో జంతువు చెట్టుపై కదులుతున్నట్లు కృష్ణాగౌడ్‌కు కనిపించింది. అదేంటో అని పరిశీలనగా చూస్తుండగా చిరుత పులి ఒక్కసారిగా చెట్టుపై నుంచి దూకింది. అయితే, అది అక్కడి కాల్వకు అవతలి వైపు ఉండటంతో వారిరువురు ఊపిరి పీల్చుకున్నారు. విషయాన్ని వారు గ్రామస్తులకు తెలియజేయగా, ఆ చిరుత పులిని చూడటానికి చాలామంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అది దూరంగా వెళ్లిపోయింది. చిరుత ఎటువైపు వెళ్లిందో తెలియక, ఎక్కడ గ్రామంలోకి వస్తుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment