
అన్నవరపు మానస, (ఫైల్)
మన్నవ(చేబ్రోలు): పొన్నూరు రూరల్ మండల పరిధిలోని మన్నవ గ్రామంలో మహిళా వలంటీర్ ప్రమాదవశాత్తూ కాలువలో పడి మరణించిన ఘటన గురువారం జరిగింది. అన్నవరపు మానస(26) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తోంది. ఉదయం స్థానికంగా ఉన్న తుంగభద్ర డ్రెయిన్‌లో దుస్తులు ఉతకటానికి వెళ్లి ప్రమాదవశాత్తూ పడిపోయింది. నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న మానసను స్థానికులు కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది.
గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అనంతనం వలంటీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వలంటీర్ మానస మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment