మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి ఏరియా ఆస్పత్రి ఆవరణలో 9 రోజుల ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు.
మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి ఏరియా ఆస్పత్రి ఆవరణలో 9 రోజుల ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఆస్పత్రి ఆవరణలోని వాటర్ ట్యాంక్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆడశిశువు ఉండటాన్ని వైద్యులు గమనించారు. దాంతో పసికందుకు సంబంధించిన వాళ్లు ఎవరూ లేకపోవడంతో పసికందును ఆస్పత్రికిలోకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. వారం రోజుల క్రితమే బొడ్డు కొసినట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఆ పసికందును ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు. కావాలని ఎవరో వదిలివెళ్లారని భావిస్తున్నారు.