ఆడపిల్ల.. సాకలేం! | parents leaved to girl chaild in shishuvihar | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల.. సాకలేం!

Published Wed, Apr 13 2016 3:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM

ఆడపిల్ల.. సాకలేం! - Sakshi

ఆడపిల్ల.. సాకలేం!

పోషణ భారమని పేగుబంధం తెంచుకున్న తల్లిదండ్రులు

ఇబ్రహీంపట్నం రూరల్: మూడోసారీ ఆడపిల్లే పుట్టింది.. ఇక సాకలేం అంటూ ఆ తల్లిదండ్రులు కన్నపేగు బంధాన్ని తెంచుకున్నారు.  ఐసీడీఎస్ సీడీపీవో శాంతిశ్రీ వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి తండాకు చెందిన జటావత్ సాలీ, భాస్కర్ దంపతులు దినసరి కూలీ లు. వీరికి కూతుళ్లు దివ్య(6), కావ్య(4) ఉన్నా రు. ఈ నెల 4న సాలీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్ట లేదని దంపతులు నిరాశకు గురయ్యారు. మూడో బిడ్డను సాకలేమని అంగన్‌వాడీ కార్యకర్త దివ్యకు చెప్పడంతో తల్లీబిడ్డను ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ సీడీపీవో శాంతిశ్రీ వద్దకు తీసుకొచ్చారు. సాలీకి  సీడీపీవో  కౌన్సెలింగ్ ఇచ్చినా వినిపించుకోక పోవడంతో పసికందును నగరంలోని శిశువిహార్‌కు తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement