ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్ మానవరహితమనే ప్రకటన వెలువడింది. ఇందుకోసం ప్రత్యేక మహిళా రోబోట్ 'వ్యోమిత్ర'ను పంపనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
అక్టోబర్ రెండవ వారంలో ట్రయల్ స్పేస్ ఫ్లైట్‌ను ప్రయోగిస్తామని చెప్పారు. తదుపరి మిషన్‌లో మహిళా రోబో "వ్యోమిత్ర"ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా గగన్‌యాన్ ప్రాజెక్టు ఆలస్యం అయిందని చెప్పారు. రెండో మిషన్‌లో భాగంగా పంపే మహిళా రోబోట్ మానవునితో సమానంగా మాట్లాడుతుందని చెప్పారు. అంతా సవ్యంగా సాగితే ముందుకు వెళతామని అన్నారు. చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరడం ఎంతో ఉపషమనం కలిగించిందని చెప్పారు.
ప్రయోగాన్ని దగ్గర నుంచి చూసినవారు ఆందోళనకు గురయ్యారు. భూ కక్ష‍్య నుంచి చంద్రుని కక్ష‍్యకు ప్రయోగం చేరినప్పుడు తాను మొదటిసారి ఆందోళన చెందినట్లు చెప్పుకొచ్చారు.
అంతరిక్ష రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ చేయూతనిచ్చారని అన్నారు. దాదాపుగా 2019 వరకు శ్రీహరికోట సందర్శనార్థం మూసి ఉండేది.. కానీ ప్రస్తుతం మీడియాకు, విద్యార్థులను ఆహ్వానిస్తోందని చెప్పారు. ఆ సంపద ఈ దేశ ప్రజలదని పేర్కొన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని మొదటి దేశం భారత్ అని అన్నారు.
గగన్‌యాన్ ఉద్దేశం:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇందులో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు సభ్యులను మూడు రోజులపాటు అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారు. ఎల్‌వీఎం3ని లాంచ్ వెహికిల్‌గా ఉపయోగించనున్నారు.
ఇదీ చదవండి: PM Modi Gets Emotional: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం..
Comments
Please login to add a commentAdd a comment