
యూనిసెక్స్ ఫ్యాషన్..ఇప్పుడు లేటెస్ట్ టాపిక్. జెండర్ ఈక్వాలిడీ, జెండర్ న్యూట్రాలిటీ క్లాతింగ్ అని కూడా అనవచ్చు. స్త్రీ, పురుషులశరీరాలకు అనుగుణంగా దుస్తుల రూపకల్పన చెయ్యటం పరిపాటి. అన్నింటిలో సమానత్వం కోరుకుంటున్నట్టుగానే వస్త్రధారణలోను సమానత్వాన్ని ఇనుమడింప చేసేందుకే యూనిసెక్స్ ఫ్యాషన్ ప్రారంభమైంది.
హ్యాపీగా జీన్స్.. చుడీదార్
‘‘వామ్మో. ఏంటే జీన్స్ వేసుకున్నావ్.. రేయ్..ఏంట్రా నీ డ్రెస్ చుడీదార్‌లా ఉంది..!’’ ఇటువంటి మాటలు 90వ దశకం వరకు వినిపించాయి. అయితే రాను రాను పరిస్థితి మారిపోయింది. గతంలో దక్షిణాదిలో చుడీదార్ వేసుకునే అమ్మాయిలు తక్కువనే చెప్పాలి. అయితే ఇప్పుడు అందరూ (అమ్మాయిలు, అబ్బాయిలు) హ్యాపీగా జీన్స్, షాట్స్ వేసుకుంటున్నారు. అబ్బాయిలు.. అమ్మాయిలు వేసుకునే కుర్తీలు కూడా కాస్త డిజైన్ మార్చి ధరిస్తున్నారు. ఈ వస్త్ర ధారణనే యూనిసెక్స్ క్లాతింగ్ అంటారు. ఇతర రాష్ట్ర సంప్రదాయ దుస్తులు స్వీకరించలేని స్థితి నుంచి సంస్కృతులకు సంబంధించిన దుస్తులు ధరించే స్థాయికి చేరుకున్నాం. సమయం, అవసరాలు, ఆలోచనలు మారుతున్న క్రమంలో లింగ బేధం లేని దుస్తుల ధరించాలనే దిశగా నేటి యువత సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్‌లో యూనిసెక్స్ ఫ్యాషన్ దుస్తులు, యాక్ససరీస్ లభిస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే పాపులర్..
యూనిసెక్స్ క్లాతింగ్‌లో రెండు రకాలు.. మొదటి రకం పూర్తిగా యూనిసెక్స్ దుస్తులు. ఏ జెండర్ వారైనా వేసుకునే విధంగా కొంచెం వదులుగా ఉండే దుస్తులు. మరొకటి, స్త్రీ, పురుషులు కామన్‌గా వేసుకునే దుస్తులు. ట్రౌజర్స్, టీ షర్ట్స్, వెస్ట్‌లు, బ్లేజర్లు, సూట్లు లాంటివి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ వేసుకుంటారు. అయితే వీటిలో కొంత ఫిట్టింగ్ మార్పులుంటాయి. ఈ దుస్తులు అందించే బ్రాండ్‌లు ఇప్పుడిప్పుడే ఇండియాలో పాపులర్ అవుతున్నాయి.
యూనిఫాం కూడా..
మిలిటరీ, పోలీసు, నేవీలో ఒకే విధమైన యూనిఫాం ఉంటుంది. కుట్టే విధానంలో చిన్న చిన్న మార్పులు మినహాయిస్తే దాదాపు యూనిసెక్స్ క్లోతింగ్ చాలా చోట్ల వచ్చేసిందనే చెప్పాలి.
స్పోర్ట్స్ వేర్‌లోజెండర్ ఈక్వాలిటీ
లండన్ ఎయిర్‌పోర్ట్‌లో రోహన్ డిజైన్ అనే స్పోర్ట్స్ వేర్ స్టోర్‌కి పనిచేసేవాడిని. అది ఇండియన్ కంపెనీ కాదు.ఆ స్టోర్‌లో, ముఖ్యంగా స్పోర్ట్స్ వేర్‌లో జెండర్ ఈక్వల్ దుస్తులు చాలా ఉండేవి. స్పెషలైజ్‌డ్ ఫ్యాబ్రిక్స్ అక్కడ ఉండేవి. అసాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి రూపొందించిన దుస్తులు కూడా అక్కడ ఉండేవి. అవన్నీ ఒక జెండర్ కోసం రూపొందించినవి కావు. హైకింగ్, మౌంటనీరింగ్ కోసం రూపొందినవి. కాబట్టి యూనిసెక్స్ క్లోతింగ్. అవి జెండర్ తేడా లేకుండా కొనుక్కుని వెళ్లేవారు. మరో లేటెస్ట్‌ఇండియన్ ఫ్యాషన్ జంప్‌సూట్స్. ఇవి జనరల్‌గాజంప్‌సూట్స్ ఆర్మీ, నేవీలో ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్న వారు విధుల్లో ధరిస్తుంటారు. వాటిని ప్యాషనబుల్‌గా రెగ్యులర్‌వేర్‌గా ధరించేలా ఫ్యాషన్ లుక్ ఇచ్చాను. హిందీ బిగ్‌బాస్ షో పార్టిసిపెంట్‌లునేను రూపొందించిన జంప్‌సూట్ వేసుకుని షోలో కనిపిస్తున్నారు. జంప్ సూట్‌లు అమ్మాయిలు కూడా వేసుకుంటారు. బాలీవుడ్‌లో శిల్పాశెట్టి, మలైకా అరోరాధరిస్తుంటారు. – నిశ్చయ్ నియోగి, ప్రముఖ స్టైలిస్ట్ ముంబై..
భారతీయ సంప్రదాయ దుస్తుల్లో అయితే..
కుర్తా, పైజామాలో పెద్ద విప్లమం వచ్చిందనే చెప్పాలి. పురుషుల కుర్తాలకు ఎంబ్రయిడారీ తక్కువ వాడతారు. అమ్మాయిల కుర్తా అయితే కొంచెం ఎక్కువ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్, ప్యాట్రన్ సేమ్‌గా ఉంటున్నాయనే చెప్పాలి. ప్రింట్స్ ఫ్యాషన్‌లో ఉన్నాయి. అవి పురుషులు కూడా హాయిగా ధరిస్తున్నారు. సంప్రదాయంగా కుర్తాలు యూనిసెక్స్ క్లోతింగ్‌లో చేరిపోయినట్లే..
నేపథ్యం..
లింగ సమానత్వం అనే అంశం మన దగ్గర ఈ మధ్యే ఊపందుకుంటోంది. ఇది విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. 1968లో లైఫ్ అనే మ్యాగజైన్‌లో తొలిసారి యూనిసెక్స్ ఈ పదాన్ని వాడారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్త్రీలకు సమానావకాశాల కల్పన జరగాలనే ఆలోచన పాశ్చాత్య దేశల్లో బలంగా వచ్చింది. అక్కడ వాళ్లు అనేక అంశాల్లో సమానత్వాన్ని సాధించారు. దుస్తుల్లోను లింగబేధంలేని వస్త్రధారణ అక్కడ చూడవచ్చు. బాగా ఫ్యాషన్ ఫాలో అయ్యే వారు వీటిని ధరిస్తుంటారు. ఇక్కడ యూనిసెక్స్ క్లోతింగ్ అంటే జనం తికమక పడతారు. అవి ఏరకమైన దుస్తులో, ఎలా ఉంటాయో అని జంకుతారు.
Comments
Please login to add a commentAdd a comment