
న్యూఢిల్లీ: భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు(88) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇండోర్‌లోని తన నివాసంలో పరమపదించారు. చంద్ర నాయుడు క్రికెట్ దిగ్గజం డా. సీకే నాయుడు కుమార్తె. క్రికెట్ వ్యాఖ్యానంతోపాటు ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ఆమె.. 50 వ దశకంలో జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడారు.
అయితే, ఆరోజుల్లో మహిళల క్రికెట్‌కు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా, ఆమె కామెంటరీపై దృష్టి సారించి, భారతదేశపు తొలి మహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు. క్రికెట్ పట్ల ఆమెకున్న ఆసక్తి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. చంద్ర నాయుడు మృతి పట్ల మాజీ క్రికెటర్, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) అధ్యక్షుడు సంజయ్ జగ్దలే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
చదవండి: పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్
Comments
Please login to add a commentAdd a comment