మహిళా యూట్యూబర్‌ అరెస్టు  | Female Youtuber Arrested In Chennai For Pushing A College Graduate To Kill Herself By Airing Her Interview | Sakshi
Sakshi News home page

మహిళా యూట్యూబర్‌ అరెస్టు 

Published Thu, May 30 2024 12:07 PM | Last Updated on Thu, May 30 2024 12:58 PM

female youtuber arrested in chennai

మరో ఇద్దరు కూడా కటకటాలలోకి..   

సాక్షి, చెన్నై: ఓ యువతి అనుమతి లేకుండా యూట్యూబ్‌ ఛానల్‌లో ఆమెకు సంబంధించిన వీడియోను అప్‌లోడ్‌ చేసిన వీరా టాక్‌ డబుల్‌ ఎక్స్‌ యూట్యూబ్‌ వ్యా ఖ్యాత వీజే శ్వేత, నిర్వాహకుడు రామ వీరప్పన్, కెమెరామెన్‌ యోగరాజ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లైక్‌లు, ప్రచారం కోసం యూ ట్యూబ్‌ ఛానళ్ల రూపంలో ఇష్టానుసారంగా వ్యవహరించే వారు రోజురోజుకూ అధికమైన విషయం తెలిసిందే. కొన్ని చానళ్లు మరీ అశ్లీలంగా మాట్లాడడం, జుగుప్స కలిగించే ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టడం, ఫ్రాంక్‌ల పేరిట వేధించడం పెరుగుతున్నాయి.

 ఈ కోవకు చెందిన వీరా టాక్‌ డబుల్‌ ఎక్స్‌ యూ ట్యూబ్‌ ఛానళ్‌ ఓ యువతి ప్రమేయం లేకుండా, ఆమె అనుమతి కూడా తీసుకో కుండా ఓ వీడియోను అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియో కారణంగా ఆయువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమాచారంతో కీల్పాకం పోలీసులు కేసు నమోదు చేశారు. యూ ట్యూబ్‌ ఛానల్‌కు చెందిన వీజే శ్వేత, నిర్వాహకుడు వలసరవాక్కంకు చెందిన రామ వీరప్పన్, కెమెరామెన్‌ యోగరాజ్‌ను బుధవారం అరెస్టు చేశారు. ఆ చానల్‌లో అశ్లీల వ్యాఖ్యలతో కూడిన వీడియోలు కోకొల్లలుగా ఉండడంతో ఆ ఛానల్‌ను సీజ్‌ చేయడానికి చర్యలు చేపట్టారు.    

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement