ఆలంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూటీ అనేది ప్రజాస్వామ్య విరుద్ధమని, హైదరాబాద్‌పై తెలంగాణ ప్రజల హక్కును హరించాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే రంగారెడ్డి జిల్లా ఉనికి కోల్పోతుందన్నారు. తెలంగాణ తామే తెచ్చామని చెప్పుకుంటున్న ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాయల తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్, భద్రాచలం సహా ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకూ టీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు.
ఈ క్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు బూత్ లెవెల్ కమిటీలను నియమిస్తున్నామని చెప్పారు. సోమవారం మేడ్చల్‌లో, 3న ధారూరు, 4న ఇబ్రహీంపట్నం, 5న పరిగి,పూడూరు, 6న వికారాబాద్, 7న చేవె ళ్ల. న వాబ్‌పేటలలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా హయత్‌నగర్‌కు చెందిన పొగాకు నర్సింహగౌడ్‌ను నియమించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి వంగేటి లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ యూటీ అంటే సహించం :నాగేందర్ గౌడ్
Published Sun, Dec 1 2013 11:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement