త్వరలో తమకు ఎ.కే.ఆంటోని కమిటీ నుంచి పిలుపు వస్తుంది రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ శుక్రవారం హైదరాబాద్లో వెల్లడించారు. ఆ సమయంలో హైదరాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను మా నివేదిక ద్వారా ఆ కమిటీకి అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తే అందరికీ నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అధిష్టానాన్ని గౌరవించి తెలంగాణపై సీడబ్ల్యూసీ చేసిన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని దానం నాగేందర్ స్పష్టం చేశారు. సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను అధిష్టానం ముందుంచారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను సమైక్యవాదినని ఎక్కడా చెప్పలేదన్న సంగతిని ఈ సందర్భంగా దానం నాగేందర్ గుర్తు చేశారు.