కరీంనగర్: యూటీపై మాట్లాడేవారికి యూటీ అంటే ఏమిటో తెలియదని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి విమర్శించారు. యూటీ గురించి మాట్లాడేవారు ముందు అదేమిటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణపై యూపీఏ సమన్వయ కమిటీ ప్రకటన చేసిన అనంతరం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం ఊపందుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ బిల్లుపై జాప్యం జరిగేకొద్దీ రాష్ట్రంలో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. తొలుత తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని తెలిపారు.
తొందరగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే సీమాంధ్రులు చల్లబడతారన్నారు. గతంలో తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన అప్రజాస్వామికమని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.