మూడు మాసాల్లో తెలంగాణ రాష్ట్రం: జీవన్‌రెడ్డి | telangan state will be formed in 3 months, says jeevan reddy | Sakshi
Sakshi News home page

మూడు మాసాల్లో తెలంగాణ రాష్ట్రం: జీవన్‌రెడ్డి

Published Mon, Aug 12 2013 7:08 PM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

మూడు మాసాల్లో తెలంగాణ రాష్ట్రం: జీవన్‌రెడ్డి

మూడు మాసాల్లో తెలంగాణ రాష్ట్రం: జీవన్‌రెడ్డి

కరీంనగర్: మరోమారు మూడుమాసాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ అంశంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు మాసాల్లో తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. డిసెంబర్ మాసానికి తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి, కొత్త గవర్నర్ నియామకం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 సీమాంధ్ర నేతలకు ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిదేనని ఆయన తెలిపారు. ఆ ప్రాంత నేతలు ద్వంద్వ నీతిని విడనాడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతర పరిస్థితులపై ఆంటోని కమిటీ ఏర్పాటు చేశారని, సీమాంధ్ర నేతలకు ఏమైనా అపోహలుంటే ఆ కమిటీ ద్వారా నివృతి చేసుకోవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement