యూటీగా హైదరాబాద్! కేంద్రానికి సూచించనున్న హోం శాఖ!
Published Tue, Sep 3 2013 3:37 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారిన హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ పరిశీలిస్తోందని జాతీయ వార్తా చానళ్లు సీఎన్‌ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీ పేర్కొన్నాయి. ఏఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ సోమవారం ఈ మేరకు కథనాలు ప్రసారం చేశాయి. పదేళ్ల దాకా కొత్త రాష్ట్రాలు రెండింటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, అనంతరం తెలంగాణలో కొనసాగుతుందని తొలుత కేంద్రం పేర్కొనడం తెలిసిందే. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో దీనిపై పునరాలోచన సాగుతోందని, ‘యూటీ’ ప్రతిపాదనను కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోందని ఆ చానళ్లు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను యూటీగా మార్చాలని కేంద్రానికి హోం శాఖ సూచించవచ్చని వివరించాయి. ఇక ఆంధ్రా రాజధానిగా విశాఖపట్నం, విజయవాడ పేర్లు ముందు వరుసలో ఉన్నట్టు పేర్కొన్నాయి.
Advertisement