హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటీ చేయండి: జేడీశీలం
ఢిల్లీ: రాష్ట్రవిభజనపై కేంద్రం వేగం పెంచిన నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కొత్తరాగం వినిపిస్తున్నారు. హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటీ చేయాలంటూ సీమాంధ్ర కేంద్రమంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యాంగ సవరణ అందుకు అవసరమని అన్నారు. అయితే తాము చెప్పే అంశాలను జీ వోఎమ్ పట్టించుకోవడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంటామని పేర్కొన్నారు. కాకపోతే హైదరాబాద్‌ను కనీసం ఐదేళ్లయినా యూటీ చేయాలంటూ కొత్తరాగాన్ని లెవనెత్తారు.
రాష్ట్రవిభనపై ఓడిపోయాం లేదా గెలిచామని కాదు.. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని శీలం తెలిపారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఓ ఉద్యోగి.. ఆయనకు కొన్ని హద్దులుంటాయని అన్నారు. అయితే కేంద్రపాలిత బాధ్యతను కేబినెట్ మంత్రులపైనే పెట్టామని ఆయన చెప్పారు. రాయలతెలంగాణ అంశాన్ని.. రాయలసీమ నేతలే తేల్చుకోవాలిని శీలం పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన సీడబ్య్లూసీ తీర్మానంలో 10 జిల్లాల తెలంగాణయే ఉందిని జేడీ శీలం స్పష్టం చేశారు.