
సిఎం కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. విభజన ప్రక్రియ తుది దశకు చేరిందని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో సీఎం కిరణ్‌కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం సీఎంకు సూచించింది.
అయితే ఏ కారణం వల్లనో ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 18న ఆయన జిఓఎంతో సమావేశమయ్యే అవకాశం ఉంది.