హస్తినలో దామోదర, జీవోఎం సభ్యులతో భేటీ | Deputy CM Damodar Rajanarasimha to meet GOM today | Sakshi
Sakshi News home page

హస్తినలో దామోదర, జీవోఎం సభ్యులతో భేటీ

Published Thu, Nov 28 2013 11:51 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM

హస్తినలో దామోదర, జీవోఎం సభ్యులతో భేటీ - Sakshi

హస్తినలో దామోదర, జీవోఎం సభ్యులతో భేటీ

న్యూఢిల్లీ : అధిష్టానం పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గురువారం హస్తిన చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు.  హైదరాబాద్ విషయంలో పరిమిత ఆంక్షలు విధిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నందున.. డిప్యూటీ సీఎం అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే ఢిల్లీకి పిలిచినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌పై పరిమిత ఆంక్షల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహం, ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలపై తాను ప్రత్యేకంగా రూపొందించిన  నోట్‌ను జీవోఎం సభ్యులకు సమర్పించనున్నట్టు సమాచారం. దామోదర తొలుత కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో భేటీ అవుతారని తెలిసింది. ఆ తరువాత అందుబాటులో ఉన్న జీవోఎం సభ్యులతో భేటీ అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement