రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను తాత్కాలిక కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధినంతటినీ రెండేళ్ల పాటు యూటీ చేసే విషయంపై తలెత్తే ఇబ్బందులేమిటో తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు.