సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో రాయల తెలంగాణ ప్రచారం నేపథ్యం లో 48 గంటల ఉద్రిక్తతకు తెరపడింది. కేంద్ర మంత్రుల కమిటీ(జీవోఎం) సమావేశం తర్వా త జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. గురువారం సాయంత్రం వర కు రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ బంద్‌ను పాటించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు రాత్రి కేంద్ర కేబినేట్ నిర్ణ యం వెలువడటంతో సంబరాలు జరుపుకున్నా రు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బెల్లంపల్లి తదితర నియోకవర్గాల్లో రాత్రి బాణాసంచా కాల్చారు. తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద ని వాళులు అర్పించారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, టీఎన్‌జీవోల సంఘం జిల్లా అ ధ్యక్షుడు అశోక్‌తోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా రాత్రి టీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఒక్క రోజు బంద్ విజయవంతమైంది.
జీవోఎం రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన బంద్ పిలుపునకు గురువారం అనూహ్య స్పందన లభించింది. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, వైఎస్సార్ సీపీలు, అనుబంధ సంఘాలు బంద్‌కు మద్దతు పలికాయి. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, న్యాయవాదులు, వ్యాపారులు, వాణి జ్య సంస్థల నిర్వాహకులకు తోడు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ప్ర భుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. వ్యాపార సంస్థలు, బ్యాంక్‌లు, సినిమా థియేటర్లు, పెట్రోల్‌బంకు లు పూర్తిగా బంద్ పాటించాయి. ఈ సందర్భం గా జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించిన తెలంగాణవాదులు కేంద్రం, మంత్రు ల కమిటీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాగా జిల్లాలోని ఆరు డిపోల నుంచి 621 బస్సులు కదలని ఫలితంగా ఆర్టీసీ సుమారుగా రూ.50 లక్షల ఆదాయాన్ని కోల్పోయింది. అదే విధంగా మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు విధులను బహిష్కరించారు. 15 భూగర్భగనుల్లో సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచింది. బంద్ నేపథ్యంలో జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మోహరించాయి.
బంద్‌కు విశేష స్పందన
టీఆర్‌ఎస్ పిలుపు మేరకు బంద్‌లో పాల్గొని జిల్లా ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నుంచి మొదలైన బంద్ కోసం తెలంగాణవాదులు పూర్థిస్తాయిలో ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. ఆర్టీసీ కార్మికులు విధులకు వెళ్లకుండా బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకష్ణాపూర్ తదితర ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. ఉద్యోగసంఘాల జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.
కాగా బంద్ నేపథ్యంలో ఉదయం నాలుగు గంటలకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్న ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. టీఎన్‌జీవో ఉద్యోగులు కలెక్టరేట్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. టీఎన్‌జీవో ఉద్యోగులు కలెక్టరేట్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి పురవీధుల్లో భారీ ర్యాలీ జరిపారు. అనంతరం ఐబీలో జేఏసీ దీక్షా శిబిరం నుంచి జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాగజ్‌నగర్ రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, పాల్వాయి రాజ్యలక్ష్మీలు దుకాణం యజమానులను బంద్ పాటించాలని కోరారు.
రియల్ తెలంగాణకు జై
Published Fri, Dec 6 2013 2:54 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement