తెలంగాణ కు కట్టుబడి ఉన్నాం: ప్రధాని
తెలంగాణ కు కట్టుబడి ఉన్నాం: ప్రధాని
Published Tue, Dec 3 2013 2:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ స్సష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ముందుకు వెళుతోందని ప్రధాని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జీఓఎం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎల్లుండి కేబినెట్ ముందుకు జీవోఎం నివేదిక రానుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలను సజావుగా నడిపేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
రాయల తెలంగాణకు సోనియా మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో కెబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశ ప్రస్తావన రాకపోవచ్చని తెలుస్తోంది.
Advertisement
Advertisement