
రేపు కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు: షిండే
తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తుది నివేదిక ఖరారు చేసింది. జీవోఎం చివరిసారిగా బుధవారం రాత్రి ఇక్కడ గంట సేపు సమావేశమై చర్చించించింది. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును గురువారం కేబినెట్ ముందు ఉంచనున్నట్టు చెప్పారు.
అక్టోబర్ 3న తమకు అప్పగించిన పనిని పూర్తిచేశామని షిండే తెలిపారు. ఇదే జీవోఎం చివరి సమావేశమని, నివేదికను కేబినెట్ పరిశీలిస్తుందన్నారు. కాగా పది జిల్లాలతో కూడిన తెలంగాణనా లేక 12 జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదు.