హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను స్వయంగా ఆహ్వానించేందుకు ఆయన రేపు దేశ రాజధానికి బయలుదేరి వెళ్ళనున్నారని తెలుస్తోంది.
కాగా తాజా పరిణామల నేపథ్యంలో ఈ నెల 16 జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని రేపు నిర్వహించడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో రేవంత్ రెడ్డి విషయంతో పాటు మరికొన్ని విషయాలను చర్చించనున్నారు. అనంతరం సీఎం ఢిల్లీ బయలు దేరివెళతారు. తర్వాత ఎల్లుండి ఢిల్లీలో చైనా ప్రతినిధులతో భేటీ అవుతారని సమాచారం.