ఇచ్చిన మాట మేరకే తెలంగాణ ఏర్పాటు: సర్వే | Congress keeps its word on Telangana, says Sarvey Sathyanarayana | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట మేరకే తెలంగాణ ఏర్పాటు: సర్వే

Nov 18 2013 12:08 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఇచ్చిన మాట మేరకే తెలంగాణ ఏర్పాటు: సర్వే - Sakshi

ఇచ్చిన మాట మేరకే తెలంగాణ ఏర్పాటు: సర్వే

ఇచ్చిన వాగ్దానం మేరకే కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు.

న్యూఢిల్లీ : ఇచ్చిన వాగ్దానం మేరకే కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేస్తోందని సర్వే  కేంద్ర మంత్రి  సత్యనారాయణ తెలిపారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ  గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు 12 పేజీలతో కూడిన నివేదిక ఇచ్చామన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసమే కాదని.... ప్రత్యేకాంధ్ర కోసం కూడా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అని సర్వే సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి రాజధాని అన్న అంశం దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలని ఆయన చెప్పారు. డిసెంబర్ చివరినాటికి ప్రక్రియ పూర్తి చేయాలని కోరినట్లు సర్వే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement