Sarvey Sathyanarayana
-
బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సర్వే!
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. మరోసారి గ్రేటర్ పీఠం దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుండగా.. తమ ప్రభావం చూపించాలని కమలదళం కసితో ఉంది. ఇరు పార్టీలు విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల విషయంలో ఆచితూచీ వ్యవహరించిన అధికార, విపక్షం.. చివరి వరకూ ఎదురుచూసి అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఇతర పార్టీలకు చెందిన అసమ్మతి నేతలను చేర్చుకుని ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని వ్యూహ రచన చేస్తున్నాయి. (టీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జీల జాబితా ఇదే!) మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకోవడం, ప్రచారం సంగతి అలాఉంచితే.. పార్టీలో ఉన్న నేతల్ని కాపాడుకోవడం నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న 100 ఏళ్ల చరిత్రగల పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. టికెట్ పంపకాల విషయంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కొత్త వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. (రాజధానిలో వేడెక్కిన రాజకీయం) జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీఫారంల పంచాయతీ తారాస్థాయికి చేరకోవడంతో టీపీసీసీకి రాజీనామాల బెదిరింపులు వరుస కడుతున్నాయి. గోశామహల్ నియోజకవర్గంలో తాను టికెట్ ఇచ్చినవారికి బీఫారం ఇవ్వకపోతే... రాజీనామా చేస్తానంటున్న ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ బెదిరింపులకు దిగారు. తన వర్గం నేతలకు సీటు కేటాయించి తీరాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. మరోవైపు కేంద్రమాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత సర్వే సత్యనారాయణ సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ నేతైన తనకు ఏమాత్రం గౌరవం దక్కడంలేదని, టీపీసీసీ నాయకత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీని వీడుతున్నట్లు ఇదివరకే ప్రకటించారని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన బీజేపీ పెద్దలను సైతం కలిశారని, చేరికకు లైన్‌క్లీయర్ అయ్యిందని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన విశ్వేశ్వరరెడ్డి.. తాను బీజేపీలో చేరడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లోనూ తనకు మంచి స్నేహితులు, సన్నిహితులు ఉన్నారని, ఆ పరిచయంతోనే వారితో కలుస్తున్నాని వివరణ ఇచ్చారు. తను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని ట్విటర్ పోస్ట్ ద్వారా కొట్టిపారేశారు. I just heard a rumour.... I am joining BJP. Yes it is a just a rumour. I have lot of friends and aquaintances in all parties inuding TRS, MIM and BJP. — Konda Vishweshwar Reddy (@KVishReddy) November 20, 2020 -
కేసీఆర్ అన్నట్లు కాంగ్రెసోళ్లు ఇడియట్లే: సర్వే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నట్లు కాంగ్రెస్ నేతలు నిజంగానే ఇడియట్లే అని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏఐసీసీ సభ్యుడైన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం టీపీసీసీకి ఎవ్వరిచ్చారని, సస్పెండ్ కాపీని చూపించే దమ్ము పీసీస నేతలకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిపోయి ఇంకా పదవులను పట్టుకుని వేళాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. గత ఎన్నికల్లో తనను, మల్లు భట్టి విక్రమార్కను ఓడించాలని ఉత్తమ్ ప్రయత్నించారని సర్వే ఆరోపించారు. కాగా, టీపీసీపీ నేతలను దూషించిన కారణంగా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సర్వే సత్యనారాయణను ఆదివారం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గూడూరు నారాయణ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు గతంలో దిగ్విజయ్ సమక్షంలోనే కొట్టుకున్నారని అప్పుడు వారినెందుకు పార్టీ నుంచి తొలగించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలపై ఎవరు సమీక్ష చేయమన్నారని అడిగినందుకే తనను సస్పెండ్ చేశారని తెలిపారు. కొల్లాపూర్, కోదాడ, పాలేరు, హుజూరాబాద్ టికెట్లును ఉత్తమ్ కుమార్ అమ్ముకున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్‌పై కేసులు ఉన్నందుకే కేసీఆర్‌కు లొంగిపోయాడని ఆరోపించారు. సర్వే మాట్లాడుతూ.. ‘ఉత్తమ్, కుంతియా హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రక్షాళన జరగాలి. ఎమ్మెల్యేలు మారినా, మండలి ఎల్పీ టీఆర్ఎస్లో విలీనమైన ఉత్తమ్ పట్టించుకోరా?. 2014లో కాంగ్రెస్ ఓడితే అందుకు బాధ్యత వహిస్తూ.. పీసీసీ చీఫ్ పదవికి పొన్నాల రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఉత్తమ్ ఎందుకు పీసీసీ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చెయ్యరు. నేను గెలిస్తే సీఎం పదవికి పోటీ అవుతాననే భయంతో నన్న ఓడించాలని ఉత్తమ్ చాలా ప్రయత్నాలు చేశారు. ఉత్తమ్, కుంతియా ముఖాలను చూసి ఎవ్వరూ ఓట్లు వెయ్యలేదు. లోక్‌సభ ఎన్నికల గెలుపు కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే, వీళ్లు ఇంకా సమీక్షలంటూ కాలక్షేపం చేస్తున్నారు. కేసీఆర్ అన్నట్ల వీళ్లు నిజంగానే ఇడియట్లు. అందరూ కలిసి పార్టీని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. త్వరలోనే నా సస్పెన్షన్‌పై అధిష్టానాన్ని కలుస్తా. నన్ను తప్పించిన వాళ్ల భరతం పడతాన’ని వ్యాఖ్యానించారు. నన్నే సస్పెండ్ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే -
నన్నే సస్పెండ్ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే
-
నన్నే సస్పెండ్ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనను సస్పండ్ చేసే అధికారం పీసీసీలో ఎవ్వరికీ లేదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గతంతో కేంద్రమంత్రిగా వ్యవహరించానని, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీకి విధేయుడినని సర్వే అన్నారు. ఉత్తమ్, కుంతియా వల్లనే పార్టీ ఓడిపోయిందని, ఓటమికి కారణమైనవాళ్లే సమీక్ష చేయడమేంటని ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ అధిష్టానం వీరికి సమీక్ష చెయ్యమని చెప్పలేదని, ఎన్నికల్లో పోటీ చెయ్యని వాళ్లు సమీక్ష సమావేశంలో ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు. కొందరు కావాలనే తనపైకి రౌడీ ముకలను ఎగదోషారని, అందుకే వారికి గట్టిగా సమాధానం చెప్పానని సర్వే వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్, కుంతియాలు టికెట్లు అమ్ముకున్నారని, టీఆర్ఎస్కు వారు కోవర్టులుగా పనిచేశారని ఆరోపించారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, రెండు రోజుల్లో వాటితో అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నన్ను పార్టీ నుంచి సస్పండ్ చేసినవారిని విడిచిపెట్టేదిలేదని, వారి భరతం పడతానని, పదవులన్నీ ఊడపీకిస్తానని సర్వే హెచ్చరించారు. టీపీసీసీపై సర్వే సంచలన వ్యాఖ్యలు -
అల్లుడొచ్చాడు!
కంటోన్మెంట్: సికింద్రాబాద్–కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు ఎట్టకేలకు ఇంటిపోరు తప్పింది. ఎన్నికల వేళ టికెట్ ఆశించి భంగపడిన సొంత అల్లుడు, పీసీసీ అధికార ప్రతినిధి క్రిషాంక్ మామపైనే పోటీకి సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు సమయంలో, ప్రచారానికి క్రిషాంక్ దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో సహజంగానే సర్వే సత్యనారాయణకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే ఆదివారం నాటి ఎన్నికల ప్రచారంలో క్రిషాంక్ పాల్గొనడం సర్వే వర్గీయుల్లో ఆనందం నింపింది. ఇక మరో అసమ్మతి నేత శ్రీగణేశ్ బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో సర్వే సత్యనారాయణకు నియోజకవర్గంలో అసమ్మతి లేకుండా పోయింది. -
చంద్రబాబు వల్లే తెలంగాణ సాధ్యమైంది : కాంగ్రెస్ నేత
కంటోన్మెంట్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చొరవతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన శనివారం టీడీపీ, టీజేఎస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలంగా ఉందని లేఖ ఇవ్వకపోతే తెలంగాణ రాకపోయేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో పాటు దమ్ముంటే బిల్లుపెట్టాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి చేసినందునే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో అప్పటి రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా కీలకపాత్ర పోషించారని, ఆయన నేతృత్వంలో యావత్ తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా పోరాడారన్నారు. ఈ క్రమంలోనే సోనియగాంధీ హృదయం చలించి తెలంగాణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
ఎంపీ అభ్యర్థులపై సర్వే ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చేవెళ్ల, మల్కాజ్‌గిరీ పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపడంపై మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల రివ్యూను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వే.. పార్టీకి చెందిన బోసురాజుపై చిందులేశారు. బోసురాజు తక్కువలో తక్కువ వెయ్యి కోట్లకు ఉంటారని, ఆయన పైసల రాజకీయాలు నడవవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కార్తీక్ రెడ్డి బదులు సబితా ఇంద్రారెడ్డిని నిలబెట్టాలని సర్వే సూచించారు. అయితే, సబితాను అసెంబ్లీకే నిలబెట్టాలని ఆమె అనుచరులు పట్టుబట్టారు. వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని సర్వే పేర్కొన్నారు. టీడీపీ, టీఆర్ఎస్లు తిరిగి వచ్చిన చంద్రశేఖర్ వికారాబాద్ టికెట్‌ను ఆశిస్తున్నారని కానీ, గెలిచే సత్తా ప్రసాద్‌కే ఉందని అన్నారు. కాగా, సర్వే వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ అయ్యారు. పార్టీలో గ్రూపులు పెడితే అధికారంలోకి రాలేమని అన్నారు. కేవలం గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే కొంతమంది నాయకులు రాష్ట్రం విడిచిపెట్టిపోయే పరిస్థితి దీన పరిస్థితి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
మల్కాజ్గిరి ఎంపీ స్థానంపై రాజకీయాలు
-
'సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వద్దు'
-
'సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వద్దు'
హైదరాబాద్ : రాష్ట్రంలో అప్పుడే రాజకీయ చదరంగం ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో టిక్కెట్లపై ఇప్పటి నుంచే వ్యూహా ప్రతి వ్యూహాలు మొదలయ్యాయి. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకి సొంతపార్టీ ఎమ్మెల్యేలే పొగబెడుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సర్వే..గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అవినీతిని ప్రోత్సహిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడుతున్నారు. మాల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్వే వ్యవహారశైలిపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఇప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు, ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి హస్తినకు చేరుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ అపాయింట్మెంట్ కోసం దొరికిన వెంటనే వీరిద్దరు సర్వేపై ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్పాయింట్మెంట్ లభించిన వెంటనే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వందని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు సర్వే మాత్రం తాను మళ్లీ మల్కాజ్గిరి నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. రాహుల్ గాంధీ మంత్రివర్గంలో పనిచేయాలనే అభిప్రాయాన్ని ఆయన తరచూ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
'చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలి'
తెలంగాణ రాష్ట్రం ఏర్పడం ఖాయమని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోందని, కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందని మంత్రి చెప్పారు. ఏలాంటి మెలికలు పెట్టకుండా తెలంగాణ ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద మద్ర వేసిన సంగతి తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించింది. రాష్ట్రపతి బిల్లును త్వరలో అసెంబ్లీకి పంపనున్నారు. -
ఇచ్చిన మాట మేరకే తెలంగాణ ఏర్పాటు: సర్వే
న్యూఢిల్లీ : ఇచ్చిన వాగ్దానం మేరకే కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేస్తోందని సర్వే కేంద్ర మంత్రి సత్యనారాయణ తెలిపారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు 12 పేజీలతో కూడిన నివేదిక ఇచ్చామన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసమే కాదని.... ప్రత్యేకాంధ్ర కోసం కూడా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అని సర్వే సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి రాజధాని అన్న అంశం దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలని ఆయన చెప్పారు. డిసెంబర్ చివరినాటికి ప్రక్రియ పూర్తి చేయాలని కోరినట్లు సర్వే తెలిపారు.