
‘సర్వే’కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న క్రిషాంక్
ఆనందంలో ‘సర్వే’
కంటోన్మెంట్: సికింద్రాబాద్–కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు ఎట్టకేలకు ఇంటిపోరు తప్పింది. ఎన్నికల వేళ టికెట్ ఆశించి భంగపడిన సొంత అల్లుడు, పీసీసీ అధికార ప్రతినిధి క్రిషాంక్ మామపైనే పోటీకి సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు సమయంలో, ప్రచారానికి క్రిషాంక్ దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో సహజంగానే సర్వే సత్యనారాయణకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
అయితే ఆదివారం నాటి ఎన్నికల ప్రచారంలో క్రిషాంక్ పాల్గొనడం సర్వే వర్గీయుల్లో ఆనందం నింపింది. ఇక మరో అసమ్మతి నేత శ్రీగణేశ్ బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో సర్వే సత్యనారాయణకు నియోజకవర్గంలో అసమ్మతి లేకుండా పోయింది.