డిసెంబర్ 15లోగా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ముందుకు పోతోంది. సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె చేపట్టినా పట్టించుకోకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పావుల్ని కదుపుతోంది. విభజన పర్యవసానాలను పక్కన పెట్టి కేంద్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై దూకుడు ప్రదర్శిస్తోంది.
విన్నపాలు, విజ్క్షప్తులను పట్టించుకోకుండా విభజన కార్యాచరణపై మున్ముందుకే కేంద్రం కదులుతోంది. నవంబర్ 28 లోపు తెలంగాణ బిల్లుకు తుది రూపు కల్పించేందుకు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. ప్రధాని, సోనియా గాంధీల ముందుకు జీవోఎం తుది నివేదికను త్వరలోనే అందించనుంది.
డిసెంబర్ 15 లోగా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం అడుగులేస్తోంది. దాంతో రానున్న వారం రోజులు అత్యంత కీలకమవ్వనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.