ముఖ్యమంత్రి కిరణ్కు జీవోఎం నుంచి పిలుపు | CM Kiran Kumar reddy Gets Call from Group of Ministers | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి కిరణ్కు జీవోఎం నుంచి పిలుపు

Published Wed, Nov 13 2013 12:13 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి కిరణ్కు జీవోఎం నుంచి పిలుపు - Sakshi

ముఖ్యమంత్రి కిరణ్కు జీవోఎం నుంచి పిలుపు

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి జీవోఎం నుంచి పిలుపు వచ్చింది.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి జీవోఎం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గురువారం ఉదయం 8 గంటలకు జీవోఎంతో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో జీవోఎం భేటీ అయ్యింది. అయితే ఈ భేటీకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంఐఎం, బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ, సీపీఎం పార్టీలో మంత్రలు బృందం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించాయి.
 

మరోవైపు విభజనకు సంబంధించి ఎలాంటి విధివిధానాలు చెప్పకుండా, తమవద్ద ఉన్న ప్రతిపాదనలేమిటో వివరించకుండా, విభ జనతో ముడిపడిన అనేకాంశాల వివరాలు, వివరణలేవీ లేకుండా మంత్రుల బృందం మొక్కుబడిగా పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. దీంతో జీవోఎం భేటీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి మౌనమే సమాధానమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement