
నెలాఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం: మొయిలీ
ఢిల్లీ: ఈ నెలఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం అవుతుందని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మొయిలీ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కేంద్రం వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్నిస్పష్టం చేశారన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన సీమాంధ్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన సీమాంధ్రులు చింతించాల్సిన పని లేదని గతంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపిన సంగతి తెలిసిందే. సీమాంధ్రకు తగిన న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. .సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంటోనీ కమిటీ ఇప్పటికే ముసాయిదా తయారు చేసిందని, దాన్ని ఒకట్రెండు రోజుల్లో జీవోఎంకు అందిస్తామని చెప్పారు.