మంత్రుల బృందం( జీవోఎం) ముందు కాంగ్రెస్ భిన్న వాదనలు వినిపించడం ఆ పార్టీ దివాళాకోరు తనానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ ఆరోపించారు.
మంత్రుల బృందం( జీవోఎం) ముందు కాంగ్రెస్ భిన్న వాదనలు వినిపించడం ఆ పార్టీ దివాళాకోరు తనానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ ఆరోపించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిలపక్షం భేటీని ఏర్పాటు చేయమని తాము అడిగామని, అయితే రహస్యంగా ఒక్కోపార్టీని ఎందుకు పిలిచారని ఆయన జీవోఎంను ప్రశ్నించారు. అలాగే రహస్య మంతనాలు ఎందుకు జరపాల్సి వచ్చిందని అడిగారు.
రాష్ట్ర విభజన జరిగే నేపథ్యంలో రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మళ్లీ ఆ ప్రాంతంలో ఉద్యమం ఎగసి పడే అవకాశాలున్నాయన్నారు. జీవోఎం సభ్యులు సీమాంధ్రలో ఏర్పడే కొత్త రాష్ట్రం గురించి తనను కొన్ని ప్రశ్నలు వేశారని చెప్పారు.అందులోభాగంగా కొత్త రాష్ట్రానికి రాజధానిగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఎక్కడైన ఏర్పాటు చేసుకోవచ్చని వారికి సమాధానం ఇచ్చినట్లు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు.