సీఎం కిరణ్ను మార్చరు: కేంద్ర మంత్రి పళ్లంరాజు | No change of Kiran Kumar Reddy as CM: Pallam raju | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ను మార్చరు: కేంద్ర మంత్రి పళ్లంరాజు

Published Fri, Nov 15 2013 10:47 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ను మార్చరు: కేంద్ర మంత్రి పళ్లంరాజు - Sakshi

సీఎం కిరణ్ను మార్చరు: కేంద్ర మంత్రి పళ్లంరాజు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చదని కేంద్ర మంత్రి పళ్లంరాజు స్పష్టం చేశారు. శుక్రవారం  కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పళ్లంరాజు ప్రారంభించారు. అనంతరం పళ్లంరాజు మాట్లాడుతూ...  తాను ఎప్పటికి సమైక్యవాదినే అని తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని ఇప్పటికికూడా పోరాడుతున్నట్లు చెప్పారు. ఓ వేళ ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమైతే తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పళ్లంరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నెల 19న జీవోఎం ఎదుట తమ వాదనలు వినిపిస్తామన్నారు.

 

కేంద్రం రాష్ట్ర విభజనపై తమదైన శైలీలో ముందుకు వెళ్తుంది. అయితే ఆ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ అనుసరిస్తున్న వైఖరిపట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గత కొద్ది కాలంగా గుర్రుగా ఉంది. దాంతో సీఎం పదవిలో మరోకరిని నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో పళ్లంరాజు పైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement