'సీఎం మార్పుపై తనకు తెలిసింది శూన్యం'
సీఎం పదవి నుంచి కిరణ్ను తప్పిస్తారన్న సంగతి తనకు తెలియదని రాష్ట్ర మంత్రి ఎస్. శైలజానాథ్ వెల్లడించారు. సీఎం మర్పు విషయంలో తన వద్ద ఉన్న సమాచారం శూన్యమని పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... నేడు న్యూఢిల్లీలో జరగాల్సిన కేంద్రమంత్రుల బృందం (జోవోఎం) సమావేశం వాయిదా పడింది, అందువల్ల సీఎం ఢిల్లీ వెళ్లలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని శైలజానాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై తన దైన శైలీలో ముందుకు వెళ్తుండగా, సీఎం కిరణ్ మాత్రం తాను ముమ్మాటికి సమైక్యవాదినే అని పలు సందర్భాలలో స్పష్టం చేశారు. దాంతో సీఎం కిరణ్ వైఖరిపై అధిష్టానం గుర్రగా ఉన్న సంగతి తెలిసిందే.