సాక్షి, న్యూఢిల్లీ : రెస్టారెంట్లకు, మాల్స్‌కు, షాపింగ్ అవుట్‌లెట్లకు కేంద్రం సరికొత్త ఆదేశాలు జారీచేసేందుకు సిద్ధమైంది. వీరు అందించే ఉత్పత్తులపై జీఎస్టీని కలుపుకునే ఎంఆర్పీని ముద్రించే విధంగా ఆదేశాలు జారీచేయబోతుంది. అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థికమంత్రుల గ్రూప్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని సీనియర్ అధికారి ధృవీకరించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన పూర్తిగా అన్ని ఉత్పత్తులపై ధరలు మారిపోయాయి. జీఎస్టీ అమలుతో ధరలు తగ్గుతాయని ఓ వైపు కేంద్రం చెబుతుంటే, వ్యాపారులు మాత్రం ధరలు బాదేస్తున్నారు. కొంతమంది రిటైలర్లు ఉత్పత్తుల ఎంఆర్‌పీ కంటే ఎక్కువగా జీఎస్టీ విధిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రుల గ్రూప్ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
ఎంఆర్‌పీ అనేది గరిష్ట చిల్లర ధర అని, ఈ ధరకే రిటైలర్ ఉత్పత్తులను అమ్మాలని, దానికంటే అదనంగా ఏ ఛార్జీలు వేసినా నేరం చేసినట్టు గుర్తించాలని మంత్రుల గ్రూప్ సూచించింది. ఎంఆర్‌పీ కంటే ఏదీ ఎక్కువ అమ్మకూడని స్పష్టం చేసింది. వస్తువు వాస్తవ ధర ఎంత, దానిపై జీఎస్టీ ఎంత అనేది ఎంఆర్‌పీ కింద వేర్వేరుగా చూపించాలని వ్యాపార సంస్థలకు సూచించింది. నవంబర్ 10న జరిగే జీఎస్టీ సమావేశంలో మంత్రుల ప్రతిపాదించిన ఈ సిఫారసును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించనుంది.
Comments
Please login to add a commentAdd a comment