
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : వీకెండ్స్‌లో రెస్టారెంట్‌కు వెళ్లడం ఖరీదైన వ్యవహారంగా మారింది. పలు వంటదినుసులపై 5 శాతం కస్టమ్స్ డ్యూటీతో పాటు, దిగుమతి చేసుకునే ఆహారంపైనా ఈ వడ్డింపుతో ధరలు భారమవుతాయని రెస్టారెంట్ చైన్స్ పేర్కొన్నాయి.వంటల్లో ఉపయోగించే ఆలివ్ ఆయిల్, ఆముదం, సీసేమ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 35 శాత పెరగ్గా, ఇతర ఆహార తయారీకి ఉపయోగించే పదార్ధాలపై గతం 30 శాతంగా ఉన్న లెవీని బడ్జెట్‌లో 50 శాతానికి పెంచారని రెస్టారెంట్ యజమానులు వాపోతున్నారు.
వంట దినుసులను దిగుమతి చేసుకునే హోటల్స్, రెస్టారెంట్లు ఈ పన్ను దెబ్బకు బెంబేలెత్తుతున్నాయి. పెరిగిన సుంకాలతో తాము కస్టమర్లపై భారం మోపక తప్పదని కైలిన్ రెస్టారెంట్ చైన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరవ్ ఖనిజో చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు జీఎస్‌టీ కింద ఇచ్చే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తొలగించడం తమ లాభాలపై పెనుప్రభావం చూపుతుందని రెస్టారెంట్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు.
ఓ మాదిరి రెస్టారెంట్లు సైతం వంట దినుసులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రమంలో వీటిపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో చివరికి వినియోగదారులపై భారం పడుతుందని రెస్టారెంట్ ఓనర్లు ధరల బాంబు పేల్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment