
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : కూకట్‌పల్లి చట్నీస్ రెస్టారెంట్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభంబించింది. షార్ట్ సర్కూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. రెస్టారెంట్ పక్కనే జోయలక్కాస్ జ్యువెల్లరీ దుకాణం ఉండటంతో నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన రెస్టారెంట్ నిర్వాహకులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరకున్న సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.