
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని రామాలయం రోడ్డులోని టీవీ రిపేరింగ్ సెంటర్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టీవీ షాపులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. షార్ట్ సర్కూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుడా పోలీసులు చర్యలు తీసుకున్నారు.