‘న్యూ ఇయర్’లో నిబంధనలు తప్పొద్దు
డీజే, ఆర్కెస్ట్రాపై ఆంక్షలు వేడుకలు సజావుగా జరుపుకోండి
నిర్వాహకులకు నగర పోలీసు కమిషనర్ సూచన
సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే స్టార్ హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ నిర్వాహకులు డీజే, ఆర్కెస్ట్రాపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆంక్షలు విధించారు. వేడుకల్లో అపశ్రుతులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో స్టార్ హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ ప్రతినిధులతో ఆయన శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... నూతన సంవత్సర వేడుకలను సజావుగా జరుపుకోవాలని కోరారు. వేడుక నిర్వహణకు అవసరమైన 27 సూచనలు, నిబంధనలను ఆయన విడుదల చేశారు. వేడుకలు నిర్వహించే హోటళ్ల నిర్వాహకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకల్లో పాల్గొనేవారికి నిర్వాహకులు పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన పరిమితి మేరకే లౌడ్‌స్పీకర్ల సౌండ్ ఉండాలన్నారు. ఆర్కెస్ట్రా ఉపయోగించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో స్టార్‌హోటళ్లు, పబ్స్ ప్రతినిధులు 150 మందితో పాటు అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, జితేందర్, జాయింట్ కమిషనర్లు వై.నాగిరెడ్డి, శివప్రసాద్, డీసీపీలు సుధీర్‌బాబు, కమలాసన్‌రెడ్డి, డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్/ఎస్‌ఓటీ ప్రత్యేక నిఘా...
న్యూఇయర్ వేడుకల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి భరతం పట్టేం దుకు నగర ంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, శివార్లలో స్పెషల ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీ సులు సిద్ధమయ్యాయి. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్ (ఈస్ట్) సూర్యప్రకాష్‌రావు (సౌత్) ఆనంద్‌కుమార్(నార్త్) భాస్కర్ (సెంట్రల్, వెస్ట్), ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఈస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్ వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్లు గురురాఘవేంద్ర, వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐలు రాములు, ఆంజనేయులు, శివ, చైతన్యకుమార్‌లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. జంట పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కూడా వీరు చర్యలు తీసుకుంటారు. రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో రేవ్‌పార్టీలు, పేకాట, మద్యం పార్టీలు నిర్విహ స్తే దాడులు చేస్తారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారి వివరాలను వీరు ఇప్పటికే ఇన్‌ఫార్మర్ల ద్వారా సేకరిస్తున్నారు.